Ts News: తెలంగాణ డీపీఆర్‌లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపించాలి: ఈఎన్‌సీ మురళీధర్‌

తాజా వార్తలు

Published : 28/10/2021 17:35 IST

Ts News: తెలంగాణ డీపీఆర్‌లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపించాలి: ఈఎన్‌సీ మురళీధర్‌

హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులకు ఆరు డీపీఆర్‌లను పరిశీలన పేరుతో జాప్యం చేస్తున్నారని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ అన్నారు. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ డీపీఆర్‌లను వెంటనే కేంద్ర జలసంఘానికి పంపించాలని లేఖలో పేర్కొన్నారు. జాప్యం చేయడం ద్వారా విభజన చట్టం క్లాజులను మీరుతున్నారని వెల్లడించారు. విభజన చట్టం క్లాజ్‌ అంశాలకే పరిమితం కావాలని.. మిగతా అంశాలను కేంద్ర జలసంఘం పరిశీలిస్తుందని ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ డీపీఆర్‌లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గతంలో సీడబ్ల్యూసీకి పంపించిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని