Ts News: హరితహారం అంటూనే చెట్లను నరికేస్తున్నారు: తెలంగాణ హైకోర్టు

తాజా వార్తలు

Published : 20/09/2021 19:33 IST

Ts News: హరితహారం అంటూనే చెట్లను నరికేస్తున్నారు: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: నగరంలోని రవీంద్రభారతి వద్ద కళాభవన్‌లో చెట్ల నరికివేతను వెంటనే నిలిపివేయాలని గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ)ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన శివకుమార్ అనే వ్యక్తి లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. ఎలాంటి కారణం లేకుండా చెట్లు నరికేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 40 ఏళ్లుగా పక్షులకు ఆవాసంగా ఉన్న చెట్లను నరకవద్దని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఓ వైపు హరితహారం అంటూనే మరోవైపు చెట్లను నరుకుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతపై స్టే విధించిన ధర్మాసనం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, అటవీ, భాషా సాంస్కతిక శాఖలను ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని