Ts News: తెలంగాణలో ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ ఖరారు

తాజా వార్తలు

Published : 27/10/2021 21:22 IST

Ts News: తెలంగాణలో ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ ఖరారు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నవంబరు 3 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొదటి, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం నవంబరు 3 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్ ఉంటుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. నవంబరు 6 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత నవంబరు 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. నవంబరు 14న ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లను కేటాయించనున్నట్లు నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. నవంబరు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

నవంబరు 21న ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్‌తో ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. నవంబరు 22న ధ్రువపత్రాల పరిశీలన, 22, 23వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 26న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్లను కేటాయించనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. స్పాట్ ప్రవేశాల కోసం నవంబరు 28న మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని