Ap News: రెండో రోజు కొనసాగిన దుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు

తాజా వార్తలు

Published : 26/10/2021 23:45 IST

Ap News: రెండో రోజు కొనసాగిన దుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు కొనసాగుతోంది. దసరా నవరాత్రుల్లో వచ్చిన ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. రెండో రోజు లెక్కింపులో రూ.6.07 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రెండో రోజు లెక్కింపులో కిలో బంగారం, 18 కిలోల వెండి కానుకలను స్వామివారికి భక్తులు సమర్పించారు. మొదటి రోజు లెక్కింపులో రూ.2.87 కోట్ల నగదు, 546 గ్రాముల బంగారం, 9.55 కిలోల వెండి కానుకలు భక్తులు అమ్మావారికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు. దుర్గ గుడి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని