Warangal: వరద నీటిలో కొట్టుకుపోయిన వారిని కాపాడిన స్థానికులు

తాజా వార్తలు

Published : 07/09/2021 01:13 IST

Warangal: వరద నీటిలో కొట్టుకుపోయిన వారిని కాపాడిన స్థానికులు

హనుమకొండ: వరద నీటిలో కొట్టుకుపోతున్న విద్యార్థులను స్థానికులు రక్షించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో సోమవారం జరిగింది. దామెర మండలం పసర గొండ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి లోలెవల్‌ వంతెన పైనుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీన్ని దాటేందుకు ముగ్గురు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో వారు వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోగా పక్కనే ఉన్న పొదల్లో చిక్కుకుపోయి కేకలు వేశారు. వెంటనే స్పందించిన స్థానికులు సాహసం చేసి తాళ్ల సాయంతో వారిని రక్షించారు.

బైక్‌తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి- పల్లారుగూడ ప్రధాన రహదారిలోని లోలెవెల్ వంతెన వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయాడు. మొండ్రాయి గ్రామానికి చెందిన కన్నె నరేష్ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును బైక్‌తో సహా దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో వరద ప్రవాహానికి బైక్‌తో సహా తను కొంత దూరం కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికుల సహాయం అందించగా నరేష్‌ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో బైక్‌ కొట్టుకుపోగా నరేష్‌కు స్పల్ప గాయాలయ్యాయి.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని