Thrill city park: థ్రిల్‌ సిటీ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్‌, తలసాని, మల్లారెడ్డి

తాజా వార్తలు

Updated : 10/09/2021 21:29 IST

Thrill city park: థ్రిల్‌ సిటీ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్‌, తలసాని, మల్లారెడ్డి

హైదరాబాద్‌: థ్రిల్‌ సిటీ పార్క్‌ హైదరాబాద్‌కు కానుకగా మారుతుందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పీవీ ఘాట్‌రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన థ్రిల్‌ సిటీ పార్క్‌ను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, సీపీ అంజనీ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. నగర వాసులు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేలా ఈ పార్కును తీర్చిదిద్దినట్టు తెలిపారు. విదేశాల్లో మాదిరిగా అన్ని రకాల గేమ్స్‌ను నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు. 

అన్ని రకాల వయసుల వారికి వినోదాన్ని అందించే విధంగా పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో హెచ్‌ఎండీఏ, థ్రిల్‌ సిటీ ఈ పార్క్‌ను తీర్చిదిద్దాయి.  ఇందులో మాన్ట్సర్‌ రైడ్‌, స్లాష్ కో స్టార్‌, ఫ్లైట్‌ స్టిములేటర్‌, వీఆర్‌ రోలర్‌ కోస్టర్‌, బంపర్‌ కార్స్‌, మ్యూజిక్‌ ట్రైన్‌ వంటి గేమ్స్‌తో పాటు వివిధ రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటయ్యాయి. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని