TS High Court: ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్‌ వేచిచూడదు: హైకోర్టు వ్యాఖ్య

తాజా వార్తలు

Updated : 08/09/2021 14:49 IST

TS High Court: ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్‌ వేచిచూడదు: హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాస్‌ ఉన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా తాత్కాలిక సీజే జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్‌ వేచి చూడదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. మరింత చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

‘‘ఇప్పటికే కరోనా బారిన పడి అనేక మంది చనిపోయారు. గత అనుభవాల దృష్ట్యా నష్టాన్ని నివారించాలి. మూడో దశ ముప్పు ముంచుకొస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు చేపట్టాలి. మేం ఆదేశించినా నిపుణుల కమిటీ భేటీ నిర్వహించలేదు. జనగామ, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మంలో పాజిటివిటీ ఒక శాతానికి పైగా ఉంది. వారంలో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించి మూడో దశ ఎదుర్కొనే ప్రణాళికలను రూపొందించాలి. పిల్లల చికిత్సకు తీసుకున్న వివరాలు సమర్పించాలి. మా ఆదేశాలు అమలు కాకపోతే డీహెచ్‌, కేంద్ర నోడల్‌ అధికారి కోర్టుకు రావాలి’’ అని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని