Ktr review on Rains: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Published : 22/07/2021 18:05 IST

Ktr review on Rains: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అదేశించారు. ఈమేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అరవింద్‌ కుమార్‌ను కేటీఆర్‌ ఆదేశించారు.

ఇప్పటికే నిర్మల్‌ వంటి చోట్ల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరుగుతున్న సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ నగరంలో మరో రెండ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పనిచేసే డిజాస్టర్‌ రెస్పాన్స్‌ దళం అందుబాటులో ఉండాలన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు ప్రతి ఒక్క పురపాలకశాఖ అధికారి, ఉద్యోగి విధుల్లో ఉంటూ స్థానికంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలివ్వాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పౌరులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని