Ts News: టీఎస్‌ పీజీఈసెట్.. ధ్రువపత్రాల ఆన్‌లైన్‌ పరిశీలన గడువు పొడిగింపు

తాజా వార్తలు

Updated : 19/10/2021 12:24 IST

Ts News: టీఎస్‌ పీజీఈసెట్.. ధ్రువపత్రాల ఆన్‌లైన్‌ పరిశీలన గడువు పొడిగింపు

హైదరాబాద్‌: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ ప్రవేశాల కోసం పీజీఈసెట్ ధ్రువపత్రాల ఆన్‌లైన్‌ పరిశీలన గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు తెలిపారు. ఈనెల 4 నుంచి ఇవాళ్టి వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని గతంలో నిర్ణయించారు. అయితే పలు విశ్వవిద్యాలయాల నుంచి ధ్రువపత్రాలు అందలేదని విద్యార్థులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. పీజీఈసెట్‌లో 17,628 మంది అర్హత సాధించగా.. దాదాపు 7,500 మంది మాత్రమే ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేశారు. పరిస్థితుల దృష్ట్యా పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సవరించారు. ఆన్‌లైన్‌ పరిశీలన కోసం ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేసే గడువును ఈనెల 25 వరకు పొడిగించారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఈనెల 28న అర్హుల జాబితా ప్రకటిస్తారు. 29, 30 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. నవంబరు 3న ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. నవంబరు 4 నుంచి 12 వరకు కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబరు 15న తరగతులు ప్రారంభమవుతాయని కన్వీనర్ పి.రమేష్ బాబు వెల్లడించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని