TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాదీ ఏకాంతంగానే: తితిదే

తాజా వార్తలు

Updated : 17/09/2021 14:07 IST

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాదీ ఏకాంతంగానే: తితిదే

తిరుమల: కరోనా పరిస్థితుల నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా మూడో దశ హెచ్చరికలు.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో వచ్చే నెల 7 నుంచి 15 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో కేటాయించే ప్రక్రియ ఆలస్యమవుతోందని.. వారంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని