TTD BOARD: తితిదే నూతన పాలక మండలి సభ్యులు వీరే?

తాజా వార్తలు

Updated : 15/09/2021 18:00 IST

TTD BOARD: తితిదే నూతన పాలక మండలి సభ్యులు వీరే?

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేశారు. బోర్డు సభ్యుల వివరాలను సాయంత్రం తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నియమితులయ్యారు. అయితే ఈసారి ఆ సంఖ్యను కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పు జరిగింది.

ఏపీ నుంచి పోకల అశోక్‌కుమార్‌, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గొల్లా బాబూరావు, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, తెలంగాణ నుంచి మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు, మన్నే జీవన్‌రెడ్డి, రెడ్డి లక్ష్మీనారాయణ, పార్థసారథిరెడ్డి, మారం శెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్‌రావు, తమిళనాడు నుంచి శ్రీనివాసన్‌, ఎమ్మెల్యే నందకుమార్‌, కన్నయ్య, కర్నాటక నుంచి శశిధర్‌, ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డి, మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‌కు అవకాశం కల్పించారు. మారుతి, సౌరభ్‌ , కేతన్‌ దేశాయ్‌, శ్రీనివాసన్‌ పేర్లు పాలకమండలి సభ్యుల జాబితాలో ఉన్నట్టు సమాచారం.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని