Raksha Bandhan Wishes: తెలుగు రాష్ట్రాల సీఎంల రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

తాజా వార్తలు

Updated : 22/08/2021 19:28 IST

Raksha Bandhan Wishes: తెలుగు రాష్ట్రాల సీఎంల రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

హైదరాబాద్: రాఖీ పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రక్షాబంధన్‌ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. జీవితాంతం సోదరులు అండగా ఉండాలని ఆడబిడ్డలు కోరుకుంటారు. రక్షాబంధన్‌ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘మహిళలు సాధికారత సాధించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దీంతో పాటు మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా, విద్య, ఉద్యోగాలపరంగా అనేక చర్యలు తీసుకుంటున్నాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

మరోవైపు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ను పలువురు ప్రముఖులు కలిశారు. విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే విడదల రజని ఆయనకు రాఖీ కట్టారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని