AP News: పాఠశాల కమిటీ ఎన్నికలు.. పలుచోట్ల ఉద్రిక్తత

తాజా వార్తలు

Updated : 22/09/2021 15:25 IST

AP News: పాఠశాల కమిటీ ఎన్నికలు.. పలుచోట్ల ఉద్రిక్తత

అమరావతి: ఏపీలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలిలో వైకాపా- తెదేపా వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని వైకాపా శ్రేణులు.. జరిపించాలని తెదేపా కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నాయి. తెదేపా శ్రేణులకు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఓటు వేసేందుకు వెళ్తున్న తల్లిదండ్రులను వైకాపా శ్రేణులు అడ్డగించేందుకు యత్నించారు. దీంతో అడ్డు తొలగాలంటూ గ్రామస్థులతో కలిసి తెదేపా నేతలు గ్రామంలో ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల తోపులాటతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారి చెదరగొట్టారు.

మరోవైపు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలోనూ ఘర్షణ వాతావరణ నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు గ్రామంలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువులో స్వల్ప ఘర్షణ జరిగింది. వైకాపాలో రెండు వర్గాల మధ్య ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు పోటీ ఏర్పడింది. పోలీసుల జోక్యంతో అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగింది. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని