HYD: విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

తాజా వార్తలు

Updated : 10/08/2021 11:42 IST

HYD: విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

 

హైదరాబాద్‌: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఈ నెల 7న సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి నోటీసు కూడా జారీ చేసింది. కాగా, ఇవాళ జరిగిన విచారణలో కౌంటర్‌ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ కోరింది. వాదనలు విన్న సీబీఐ ధర్మాసనం విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించినందుకు బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ కోర్టును కోరిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని