Visakha Steel Plant: అడ్మిన్‌ బిల్డింగ్‌ను ముట్టడించిన కార్మికులు

తాజా వార్తలు

Updated : 17/08/2021 15:08 IST

Visakha Steel Plant: అడ్మిన్‌ బిల్డింగ్‌ను ముట్టడించిన కార్మికులు

విశాఖ: ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఉక్కు పరిశ్రమ పరిపాలనా భవనాన్ని (అడ్మిన్‌ బిల్డింగ్‌) ముట్టడించారు. వర్షంలోనే గొడుగులతో కార్మిక సంఘాల నేతలు నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనతో చాలా అన్యాయం జరిగిందని.. ఉన్న ఒకే ఒక్క భారీ పరిశ్రమను తీసుకెళ్లేందుకు యత్నిస్తే సహించేది లేదని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సొంత గనులు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. పోరాటాల ద్వారానే విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చిందని.. దీన్ని కాపాడుకుంటామన్నారు. కార్మిక సంఘాల ఆందోళనతో పరిపాలనా భవనం కూడలి ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని