Viveka murder case: సీబీఐ విచారణకు హాజరైన వైకాపా ఎమ్మెల్యే

తాజా వార్తలు

Updated : 04/09/2021 20:24 IST

Viveka murder case: సీబీఐ విచారణకు హాజరైన వైకాపా ఎమ్మెల్యే

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 90వ రోజుకు చేరింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. కడప కేంద్ర కారాగార అతిథిగృహంలో సుమారు గంటపాటు రవీంద్రనాథ్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా బంధువు, రాజకీయ నేతను కాబట్టే తనను విచారణకు పిలిచారని, తనకు తెలిసిన సమాచారం అంతాం అధికారులకు చెప్పానని రవీంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. వివేకా హత్యకేసు వీలైనంత త్వరగా తేల్చాలని అధికారులను కోరినట్టు వివరించారు. పులివెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ సమీపంలో  చెప్పుల షాపు నిర్వహించే మున్నా, ఆయన భార్యను కూడా సీబీఐ అధికారులు విచారించారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని