Suicide: అన్నతో నిశ్చితార్థం.. తమ్ముడితో పెళ్లి.. నవ వధువు ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 09/08/2021 10:43 IST

Suicide: అన్నతో నిశ్చితార్థం.. తమ్ముడితో పెళ్లి.. నవ వధువు ఆత్మహత్య

పహాడీషరీఫ్, న్యూస్‌టుడే: నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన సంఘటన బాలాపూర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ వివరాల తెలిపిన ప్రకారం... పాతబస్తీ వట్టెపల్లికి చెందిన షబ్బీర్‌ అలీ కుమార్తె షాహిన్‌బేగం(25)తో జల్‌పల్లి న్యూబాబానగర్‌ నివాసి మీర్‌ ఇస్మాయిల్‌ఉద్దీన్‌ అలీకి 28 రోజుల క్రితం వివాహం జరిగింది. మూడేళ్లక్రితమే ఇస్మాయిల్‌ఉద్దీన్‌ అలీ అన్నయ్యతో ఆమెకు నిశ్చితార్థమైంది. అనంతరం సోదరులిద్దరూ ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లారు. కరోనా నేపథ్యంలో అతడు ఇంటికి రాలేదు. నెలన్నర క్రితం తమ్ముడు ఇస్మాయిల్‌ ఉద్దీన్‌ అలీ తిరిగివచ్చాడు.

పెద్ద కుమారుడి ఆచూకీలేకపోవడంతో రెండు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్‌బేగంను ఇస్మాయిల్‌ ఉద్దీన్‌ అలీకి ఇచ్చి జులై 12న పెళ్లి చేశారు. సోదరుడికి నిశ్చితార్థమైన అమ్మాయితో తనకు వివాహం చేశారంటూ అలీ తీవ్రంగా మదనపడేవాడు. భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించేవాడు. దీనికితోడు కట్నకానుకల విషయమై అత్తమామల నుంచి సైతం వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో కలత చెందిన షాహిన్‌ బేగం శనివారం తన గదిలోని ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని