వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం నిధుల విడుదల
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 15:44 IST

వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం నిధుల విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం రెండో ఏడాది నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ మీట నొక్కి 3.27లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థికసాయం చేయనున్నట్లు వివరించారు.

పాత బకాయిలకు కాపు నేస్తం నగదు జమ చేసుకోకూడదని బ్యాంకులకు సూచించామన్నారు. రెండేళ్లలో కాపునేస్తం ద్వారా రూ.982 కోట్ల జమ చేసినట్లు జగన్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని