NGT: తెలంగాణపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి: ఎన్జీటీలో ఏపీ వాదన

తాజా వార్తలు

Published : 16/09/2021 19:16 IST

NGT: తెలంగాణపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి: ఎన్జీటీలో ఏపీ వాదన

దిల్లీ: ఏపీ సర్కార్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై  ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ముందు గురువారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా అనే అంశంపై వాదనలు జరిగాయి. కోర్టు ఉల్లంఘనలపై ఎన్జీటీకి ఉన్న అధికారాలపై ఏపీ వాదనలు ముగిశాయి. ప్రజోపయోగ పనులు చేపట్టినందుకు జైలుకు పంపుతారా అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు చేసినవి డీపీఆర్‌, ఇతర పనుల కోసమేనని ఏపీ తెలిపింది. ఇప్పటి వరకు చేసిన పనులు పూడ్చమంటారా? అని అడిగిన ఏపీ ప్రభుత్వం... ప్రజోపయోగ పనులను న్యాయస్థానం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం ఫొటోలు ఇచ్చిందని తెలిపింది. తప్పుడు ఫొటోలు పంపిన తెలంగాణపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ లేవనెత్తిన అంశాలపై ఈనెల 21న పిటిషనర్‌ గవినోళ్ల శ్రీనివాస్‌, తెలంగాణ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని