Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 28/07/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్‌

కరోనా చికిత్స చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైపు సిలిండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనికోసం నిపుణులను నియమించటంతో పాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. 

2. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తాం: కేటీఆర్‌

మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌ వీహబ్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జైయేశ్‌ రంజన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రూపొందించిన అంకురాలను పరిశీలించారు. 

తెలంగాణలో త్వరలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు?

3. రామప్ప సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు

రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో విచారణ జరిగింది. పత్రికల కథనాలపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. యునెస్కో విధించిన గడువు విధించిన డిసెంబర్‌ నెలాఖరు వరకు సమగ్ర సంరక్షణ చేపట్టాలని ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్ లతో కమిటీ ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

4. కేసీఆర్ అహంకారానికి.. నాకు మధ్యే పోరు: ఈటల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని హుజూరాబాద్‌ ప్రజలు నిర్ణయించుకున్నారని భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఈటల చేపట్టిన ప్రజా దీవెన యాత్ర పదో రోజుకు చేరింది. దీనిలో భాగంగా హుజూరాబాద్‌ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని ధర్మారం, శాయంపేట గ్రామాల్లో ఈటల పాదయాత్ర నిర్వహించారు. 

5. స్పీకర్‌ ఛైర్‌పైకి పత్రాలు విసిరిన కాంగ్రెస్‌ ఎంపీలు

పెగాసస్‌తో ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు చేతబట్టి గట్టిగట్టిగా నినాదాలు చేశారు. లోక్‌సభలో అయితే కాంగ్రెస్‌ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్‌ ఛైర్‌పైకి విసిరారు. దీంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

6. మన ఫోన్లలోకి మోదీజీ ఆయుధాన్ని పంపారు..!

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించే పెగాసస్‌ స్పైవేర్‌ను మన ఫోన్లలోకి జొప్పించిన కేంద్రం.. ఇప్పుడు ఆ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై నేడు రాహుల్‌ నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు.

7. దేశవ్యాప్తంగా తగ్గినా.. కేరళను వణికిస్తోన్న మహమ్మారి!

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మూడో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉండడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది.

8. Supreme Court: ఆస్తులు ధ్వంసం చేయడం స్వేచ్ఛ కాదు..!

2015లో కేరళ శాసనసభలో అనుచితంగా ప్రవర్తించి, ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన కేసులో ఎల్‌డీఎఫ్‌ కూటమికి చెందిన శాసనసభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందనేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సదరు ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులను రద్దు చేయాలని కోరుతూ కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. 

9. కృష్ణంరాజుకు లేఖ.. అధ్యక్ష పోరుపై రేపు రానున్న స్పష్టత..!

మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఎన్నికలు గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారాయి. కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకముందే అధ్యక్ష పదవికి సిద్ధమంటూపలువురు ప్రకటించారు. దీంతో మా అసోసియేషన్‌లో వేడి రాజుకుంది. తాజాగా మా కార్యవర్గ పదవీకాలం ముగిసింది. దీంతో కార్యవర్గ సభ్యులు ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగిసిందని, ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో కోరారు. 

10.  పూజారాణి.. క్వార్టర్స్‌ గెలిస్తే పతకమే! క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన దీపిక

భారత యువ బాక్సర్‌ పూజారాణి (75 కిలోలు) సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌ చేరిందంటే ఆమెకు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ నంబర్‌ వన్‌ ఆర్చర్‌ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. మిగిలిన క్రీడాంశాల్లో నిరాశే మిగిలింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని