Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 02/08/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ప్రభుత్వ ఆస్పత్రులు మరింత మెరుగవ్వాలి: జగన్‌
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మరింత మెరుగుపడాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణ, వైద్యశాలలు, నాడు- నేడుపై ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దాలని నిర్దేశించారు. 45 ఏళ్లుపైబడిన వారు, గర్భిణీలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరవనున్నందున ఉపాధ్యాయులందరికీ టీకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

పోలవరం రివైజ్డ్‌ డీపీఆర్‌ పెండింగ్‌లో లేదు: కేంద్రం

2. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి రూ.150 కోట్లు: కేసీఆర్‌

నల్గొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వీటన్నింటినీ ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. హాలియాలో డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం నిర్మిస్తామన్నారు.

గోషామహల్‌కు ప్యాకేజీ ప్రకటిస్తే నేను రాజీనామా చేస్తా!

3. పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?: హైకోర్టు

 పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు లాకప్‌లో మరియమ్మ మృతి ఘటనపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్‌ మార్టం పూర్తయిందని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మృతురాలి కుటుంబానికి రూ.15లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు.

4. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కానివ్వబోం: విజయసాయి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం దేశ రాజధానిలో విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు మహా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటికీ నెలకు రూ.200 కోట్ల లాభంతో ఉక్కు కర్మాగారం నడుస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరణ చేయటం భాజపావిధివిధానాల్లో ఒకటి. కానీ, విశాఖ ఉక్కు లాభాల్లో నడుస్తోంది. మధ్యలో కొన్ని నష్టాలు వచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన సంస్థను ప్రైవేటీకరించడం తగదు’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

5. ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌పై కొవాగ్జిన్‌ భేష్‌

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకా డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దేశంలో కరోనా ఉద్ధృతి, వ్యాక్సిన్ల పనితీరుపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఓ అధ్యయనం చేపట్టింది. భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్‌ నుంచి కొవాగ్జిన్‌ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోంది.

6. ఒక్క నిమిషంలో బిల్లును ఆమోదిస్తారా?.. ఇక్కడేమైనా చాట్ చేస్తున్నారా?

నిమిషాల వ్యవధిలో పార్లమెంట్‌లో ప్రభుత్వం పలు బిల్లుల్ని ఆమోదించడంపై తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రీన్ మండిపడ్డారు. ఇక్కడేమైనా చాట్ తయారు చేస్తున్నారా? అంటూ కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. పార్లమెంట్ పవిత్రతను ఉల్లంఘిస్తోందని ట్విటర్‌లో ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 12 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. హడావుడిగా వాటికి ఆమోదం లభించింది.

7. రద్దయిన చట్టం కింద కేసులు.. రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

రద్దయిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు కావడంపై సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే అన్ని హైకోర్టుల్లోని రిజిస్ట్రార్‌ జనరల్‌ను కూడా ఆ నోటీసుల్లో భాగం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ‘న్యాయపరంగా ఈ అంశాన్ని విడిగా పరిశీలిస్తాం. దీనిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు ఇస్తున్నాం’ అంటూ సుప్రీం వెల్లడించింది.

8. తనకు తాను ప్రధానిగా ప్రకటించుకున్న మయన్మార్‌ ఆర్మీ చీఫ్‌

మయన్మార్‌ ఆర్మీ చీఫ్‌ యంగ్‌ మిన్‌ ఆంగ్‌ హ్లయింగ్‌ తనకు తాను దేశ ప్రధానినని ప్రకటించుకున్నారు. గత కొద్ది నెలలుగా ఆ దేశం రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటుండగా.. ‘మయన్మార్‌ సంరక్షక ప్రభుత్వం’ పేరుతో స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ ప్రధానిగా ఆగస్టు 1న హ్లయింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. 

9. జొమాటో కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌.. యాప్‌ చెక్‌ చేయండి!

ఈ మధ్యే ఐపీవోతో దుమ్మురేపిన ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో.. మరో కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌తో రాబోతోంది. అన్‌లిమిటెడ్‌ ఫ్రీ డెలివరీ.. నో సర్జ్‌ ఫీ.. నో డిస్టెన్స్‌ ఫీ.. అంటూ ముందుకొస్తోంది. ఈ మెంబర్‌షిప్‌ ప్లాన్‌కు జొమాటో ప్రో ప్లస్‌ అని నామకరణం చేసింది. అయితే, పరిమిత కాలం పాటు పరిమిత సంఖ్యలోనే ఈ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నట్లు జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

10. అమ్మాయిలు.. శెభాష్‌! మా మనసులు గర్వంతో నిండిపోయాయి!
ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెమీస్‌లోనూ అర్జెంటీనాను ఓడించి పతకం ఖాయం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి ప్రముఖుల వరకు అమ్మాయిలను ప్రశంసిస్తున్నారు. సోమవారం జరిగిన క్వార్టర్స్‌లో టీమ్‌ఇండియా 1-0 తేడాతో మూడుసార్లు విజేత ఆసీస్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని