తాత్కాలికంగా కాచిగూడ నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

తాజా వార్తలు

Published : 14/03/2021 01:01 IST

తాత్కాలికంగా కాచిగూడ నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆటోమాటిక్‌ కోచ్‌ వాష్‌ ప్లాంట్‌ (ఏసీడబ్ల్యూపీ) నిర్మాణం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే మూడు ప్రత్యేక రైళ్ల రాకపోకల విషయంలో తాత్కాలిక మార్పులు చేశారు. ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, అజంతా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- దనపూర్‌ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి కాకుండా కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలను కొనసాగిస్తాయని ప్రకటనలో వెల్లడించారు. దీని ప్రకారం సికింద్రాబాద్‌ నుంచి హావ్‌డా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు (02704) ఈ నెల 15 నుంచి కాచిగూడ నుంచి బయల్దేరనుంది. అలాగే, సికింద్రాబాద్‌ - దనపూర్‌ (02787),  సికింద్రాబాద్‌ -మన్మాడ్‌ ప్రత్యేక రైళ్లు (అజంతా ఎక్స్‌ప్రెస్ - 07064) రైలు కూడా నిర్ణీత కాలంలో సికింద్రాబాద్‌కు బదులు కాచిగూడ నుంచి తాత్కాలికంగా రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. ఈ మూడు రైళ్లు తిరుగు పయనంలోనూ కాచిగూడకే చేరుకుంటాయని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని