టెన్త్‌, ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు

తాజా వార్తలు

Updated : 15/04/2021 20:30 IST

టెన్త్‌, ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు

ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా

ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయగా.. ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఎస్‌ఎస్‌ఈ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్‌ విధానం ద్వారా పదో తరగతి ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. టెన్త్‌ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఆదేశాలు జారీచేశారు.

జూన్‌ రెండో వారంలో సమీక్షించి రెండో సంవత్సర పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. బ్యాక్‌లాగ్‌ ఉన్న రెండో సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్‌ మార్కులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత పరీక్షల నిర్వహణపై ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ బోర్డు అధికారులతో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమావేశం నిర్వహించారు. పరీక్షల రద్దు, వాయిదా ప్రతిపాదనలకు సంబంధించిన దస్త్రాలను సీఎం కేసీఆర్‌కు పంపారు. సీఎం‌ ఆమోదం అనంతరం విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని