Dairy milk: క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌ యాడ్‌లో ఇది గమనించారా..?

తాజా వార్తలు

Published : 18/09/2021 01:06 IST

Dairy milk: క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌ యాడ్‌లో ఇది గమనించారా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: 90వ దశకంలో వచ్చిన డెయిరీ మిల్క్‌ చాక్లెట్‌ ప్రకటన చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓ అమ్మాయి క్రికెట్‌ మ్యాచ్‌ను చూస్తూ చాక్లెట్‌ తింటున్నట్లు అందులో ఉంటుంది. మైదానంలో ఆమె బాయ్‌ఫ్రెండ్‌ బ్యాటింగ్‌ చేస్తుంటాడు. అతడు సెంచరీ చేయటానికి ఒక పరుగు దూరంలో ఉండగా విన్నింగ్‌ షాట్‌ కొడతాడు. అప్పుడు వెంటనే ఆమె మైదానంలోకి డ్యాన్స్‌ చేసుకుంటూ వచ్చి అతడ్ని హగ్‌ చేసుకుంటోంది. అప్పుడే ‘అస్లీ స్వాద్‌ జిందగీ కా’ అనే ట్యాగ్‌లైన్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. దీన్ని ప్రముఖ యాడ్‌ ఏజెన్సీ సంస్థ ఓగిల్వి క్రియేట్‌ చేసింది. చాక్లెట్‌ చిన్నారులకు మాత్రమే అనే భావనను మార్చినందుకు ఈ యాడ్‌ అప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందింది.

కాగా.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ యాడ్‌ వెలుగులోకి వచ్చింది. దీనిలో పాత్రలను మారుస్తూ కొత్తగా రూపొందించింది. ఈసారి అబ్బాయి చాక్లెట్‌ తింటూ క్రికెట్‌ మ్యాచ్‌ను చూస్తుంటాడు. అతని గర్ల్‌ఫ్రెండ్‌ విన్నింగ్‌ సిక్స్‌ కొట్టగానే అతను మైదానంలోకి వచ్చి డ్యాన్స్‌ చేస్తుంటాడు. తర్వాత ఆమెను కౌగిలించుకుంటాడు. ఎన్నో దశాబ్దాలుగా క్రికెట్ ఎక్కువగా పురుషులే ఆడతారనే భావనను ఈ ప్రకటన మార్చేసింది. దీన్ని గమనించిన నెటిజన్లు కంపెనీని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘‘క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్, ఓగిల్వికి అభినందనలు. కొంచెం ఆలస్యమైనా తన యాడ్‌లో మార్పులు చేస్తూ స్ర్తీ, పురుషులు సమానమనే భావనను తీసుకొచ్చారు’’ అంటూ ఓ ట్విటర్‌ యూజర్ రాసుకొచ్చారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ యాడ్‌ను మీరూ చూసేయండి మరి..



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని