ట్రాఫిక్‌ కానిస్టేబుల్ దారిచ్చిన వృద్ధుడు క్షేమం

తాజా వార్తలు

Published : 09/11/2020 20:44 IST

ట్రాఫిక్‌ కానిస్టేబుల్ దారిచ్చిన వృద్ధుడు క్షేమం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అబిడ్స్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బాబ్జీ పరిగెడుతూ అంబులెన్స్‌కు దారి ఇచ్చిన ఘటనలో వృద్ధుడు క్షేమంగా ఇంటికి చేరాడు. హయత్‌నగర్‌కు చెందిన వ్యక్తి గుండె, మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు మలక్‌పేట్‌ యశోద ఆసుపత్రికి తరలించారు. అబిడ్స్‌-కోఠి రోడ్డులో అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్న సమయంలో కానిస్టేబుల్‌ బాబ్జీ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. కానిస్టేబుల్‌ ట్రాఫిక్‌ను నియంత్రించిన వీడియోను వృద్ధుడి కూతురు, అల్లుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అవుతున్న సమయంలో కానిస్టేబుల్‌ బాబ్జీకి వృద్ధుడు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కానిస్టేబుల్‌ చేసిన సహాయానికి పోలీసు ఉన్నతాధికారులు, నెటిజన్లు అభినందించిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని