ఆ భారీ శబ్దాలు అందుకే వచ్చాయా..!

తాజా వార్తలు

Updated : 30/09/2020 18:47 IST

ఆ భారీ శబ్దాలు అందుకే వచ్చాయా..!

పారిస్‌: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరంలో బుధవారం ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. ఉన్నట్టుండి భారీ బాంబు పేలుళ్ల తరహాలో పెద్దపెద్ద శబ్దాలు వినిపించడం నగరవాసుల్లో ఆందోళనలను రేకెత్తించాయి. దీంతో అందరూ బాంబు పేలుడు జరిగిందేమోనని కంగారు పడిపోయారు. కానీ అలాంటిదేమీ జరగలేదంటూ పారిస్‌ పోలీసులు వివరణ ఇచ్చారు. కేవలం శబ్ద నిరోధకాల(సౌండ్‌ బారియర్స్‌) వల్లే ఈ భారీ శబ్దాలు వినిపించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు పారిస్‌ పోలీసులు ట్విటర్‌ వేదికగా నిర్దారణ చేశారు.

‘పారిస్‌ పరిసర ప్రాంతాల్లో ఓ పెద్ద శబ్దం వినిపించింది. అది ఎలాంటి పేలుడుకు సంబంధించినది కాదు. ఓ యుద్ధ విమానం ధ్వని నిరోధకాలను దాటుకుని వెళ్లింది. అందుకే ఈ శబ్దాలు వచ్చాయి’ అని పోలీసులు తెలిపారు. పారిస్‌ నగరవాసులు కొందరు టెన్నిస్‌ మైదానంలో ఆట ఆడుతుండగా పేలుడు శబ్దం వినిపించిన వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ ‌చేశారు. కాగా గత మే నెలలోనూ కర్ణాటకలోని బెంగళూరులో ఇదే తరహా భారీ శబ్దాలు వినిపించిన విషయం తెలిసిందే. అందరూ భూకంపం అనుకుని భయపడ్డారు. కానీ యుద్ధవిమానాల వల్లే ఆ శబ్దం వచ్చిందని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని