Bihar: టీకా కోసం కుమ్ములాట

తాజా వార్తలు

Published : 07/08/2021 19:48 IST

Bihar: టీకా కోసం కుమ్ములాట

పాట్నా: బీహార్ అరారియా జిల్లాలోని ఓ వ్యాక్సిన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫారబిస్ గంజ్ సబ్‌డివిజన్‌లో ఓ గ్రామంలో వ్యాక్సిన్ కోసం టీకా కేంద్రానికి వెళ్లిన గ్రామస్తులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ పరస్పర దాడులకు దిగారు. ఈ క్రమంలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో కొందరు పుట్టించిన పుకార్ల కారణంగా టీకా కేంద్రం వద్ద గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. టీకా తీసుకుంటేనే ప్రభుత్వ ఫలాలు అందుతాయని గ్రామంలో విపరీతంగా ప్రచారం జరగడంతో గ్రామస్థులు టీకా కేంద్రానికి పోటెత్తారు. క్యూ పద్దతి పాటించకుండా కొందరు వ్యక్తులు టీకా పొందేందుకు ప్రయత్నించడంతో వివాదం చెలరేగినట్లు వైద్యాధికారి తెలిపారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని