కారం కొట్టాడు.. క్షణాల్లో దొరికాడు

తాజా వార్తలు

Published : 21/08/2020 22:00 IST

కారం కొట్టాడు.. క్షణాల్లో దొరికాడు

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ దొంగ నగల దుకాణ యజమానిపై కారం చల్లి చోరీకి యత్నించాడు. సాధారణ వినియోగదారుని లాగే దుకాణంలోకి ప్రవేశించిన ఆ దొంగ షాపు యజమానితో మాటలు కలిపాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కారంపొడిని యజమాని ముఖంపై చల్లి 45 నుంచి 50 గ్రాములున్న బంగారంతో ఉడాయించే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన దుకాణదారుడు కేకలు వేయడంతో షాపు బయటే ఉన్న వ్యక్తులు అతడిని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని