ఆంధ్రప్రదేశ్‌కు 3 అవార్డులు
close

తాజా వార్తలు

Updated : 01/01/2021 13:53 IST

ఆంధ్రప్రదేశ్‌కు 3 అవార్డులు

అమరావతి: పేదలు సౌకర్యంగా నివసించే సొంతింటి కోసం సుదీర్ఘకాలం నిరీక్షించే పరిస్థితిని తమ ప్రభుత్వం మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అంతర్జాతీయ గృహ సాంకేతిక సవాళ్ల కార్యక్రమం కింద ఇండోర్‌, రాజ్‌కోట్‌, చెన్నై, రాంచీ, అగర్తలా, లఖ్‌నవూలో వెయ్యి చొప్పున గృహాల నిర్మాణం కోసం ఉద్దేశించిన లైట్‌ హాస్‌ ప్రాజెక్టును ప్రధాని ప్రారభించారు. వర్చువల్‌ మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌ సహా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. లైట్‌హాస్‌ ప్రాజెక్టు కింద ఇళ్ల నిర్మాణానికి తక్కువ సమయం పడుతుందని చెప్పారు. దేశంలో స్థిరాస్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. 

‘2022 నాటికి అందరికీ ఇళ్లు’ అనే కేంద్రం లక్ష్యంలో ఏపీ ముందుందని సీం జగన్‌ అన్నారు. ప్రధాని సమక్షంలో వర్చువల్‌గా జరిగిన పీఏంఏవై(అర్బన్‌) ఆశా ఇండియా అవార్డుల కార్యక్రమంలో జగన్‌ పాల్గొన్నారు. పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఏపీకి మూడవ ర్యాంకుతో పాటు అవార్డు లభించింది. బెస్ట్‌ ప్రాక్టీస్‌, ఇన్నోవేషన్‌ విభాగంలో మరో రెండు అవార్డులు వరించాయి. ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ విభాగంలో  గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి ర్యాంకు సాధించి సత్తా చాటింది.

ఇవీ చదవండి..

విఘ్నేశ్వరస్వామి ఆలయంలో విగ్రహం ధ్వంసం

చౌడేశ్వరీ ఆలయంలో రాచమల్లు ప్రమాణంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని