టబ్‌లో పులి.. ఏం చేసిందంటే?

తాజా వార్తలు

Published : 13/12/2020 02:18 IST

టబ్‌లో పులి.. ఏం చేసిందంటే?

దిల్లీ: సాధారణంగా పులులు, సింహాలు సరస్సులు, కొలనుల్లో జలకాలాడుతుంటాయి. కానీ.. ఓ పులి మాత్రం అచ్చం చిన్నపిల్లోడిలా టబ్‌లోకి దిగి స్నానం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలోని కొడుగులో ఓ ఇంటి యజమాని ఏదో అవసరం కోసం తోటలో నీటితొట్టి ఏర్పాటు చేసుకున్నాడు. అటుగా వచ్చిన  ఓ పులి ఆ తొట్టి దగ్గరకు వచ్చింది. దాదాపు రెండు నిమిషాలు గల ఈ వీడియోలో పులి టబ్‌ చుట్టూ తిరుగుతూ నిశితంగా పరిశీలించింది. అనంతరం అందులోకి దిగి జలకాలాడింది. మళ్లీ ఎవరైనా వస్తే పారిపోవడానికి అనువుగా ముందు కాళ్లను బయటికే ఉంచి స్నానం చేసింది. 
ఈ వింత సంఘటనను కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. దీన్ని చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం తెగ సంబరపడ్డారు. పైగా ఈవీడియోనూ రీట్వీట్‌ చేస్తూ.. ‘పులి ఇలా చేయడం తాను ఇదివరకెప్పుడూ చూడలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన.. కర్ణాటకలోని కొడుగులో గడిపిన తన చిన్ననాటి రోజులను’గుర్తు చేసుకున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని