TS Corona: రాష్ట్రంలో కొత్తగా 1197 కరోనా కేసులు
close

తాజా వార్తలు

Published : 21/06/2021 17:58 IST

TS Corona: రాష్ట్రంలో కొత్తగా 1197 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఇప్పటికే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. కాగా, గత 24 గంటల్లో 1,19,537 శాంపిల్స్‌ను పరీక్షించగా, కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,14,399కి చేరింది. ఇక కరోనాతో బాధపడుతూ 9మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 3,576కు చేరింది. తాజాగా 1,709 మంది కరోనా నుంచి కోలుకోవడంతో వ్యాధి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,93,577కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా జీహెచ్‌ఎంసీలో 137 కరోనా కేసులు నమోదవగా, నల్గొండలో 84, సూర్యాపేటలో 72, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, భద్రాద్రి కొత్తగూడెంలలో 71 కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని