టాప్‌ 10 న్యూస్‌ - 9 AM
close

తాజా వార్తలు

Updated : 12/04/2021 08:59 IST

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. దేశానికి కొత్త మ్యాప్‌ కావాలి..

డబ్బు, కండబలం భారత ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయని, ప్రకృతి వనరుల విధ్వంసం, పౌష్టికాహార లోపం, వ్యవసాయ సంక్షోభం, మహిళలపై హింస తదితర సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగుతూ, వనరులను ప్రైవేటుకు అప్పజెబుతూ పోతే ధనిక, పేద వర్గాలుగా దేశం విడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలనే రాజకీయ మ్యాప్‌లు చెదరకుండా, దేశాన్ని పర్యావరణపరంగా గుర్తిస్తూ కొత్త మ్యాప్‌ ఉండటం శ్రేయస్కరమని ఆయన చెబుతున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల గురించి ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఇరాన్‌ అణు కర్మాగారంపై సైబర్‌ దాడి!

యురేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను ప్రారంభించిన ఇరాన్‌కు ఆదిలోనే ఇబ్బంది ఎదురైంది. నతాంజ్‌లోని అణు కర్మాగారంలో ఈ యంత్రాలను పనిచేయించడం మొదలుపెట్టిన కొద్దిగంటలకే అనూహ్యంగా అక్కడ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఘటనను ఇజ్రాయెల్‌ సైబర్‌ దాడిగా స్వయంగా అక్కడి మీడియా పేర్కొంది. నతాంజ్‌ కర్మాగారంలో అత్యంత కీలకమైన సెంట్రిఫ్యూజులు ఉన్నాయి. విద్యుత్‌ సమస్య వల్ల.. నేలపై ఉన్న వర్క్‌షాప్‌లు, నేలమాళిగలోని అణుశుద్ధి యూనిట్లు సహా కర్మాగారం అంతటా విద్యుత్‌ నిలిచిపోయిందని ఇరాన్‌ అణు విభాగం అధికార ప్రతినిధి బెహ్రౌజ్‌ కమల్‌వాండి చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా సుశీల్‌ చంద్ర!

దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌ చంద్ర నియమితులు కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్రను సీఈసీగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ కావచ్చని తెలుస్తోంది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. దోచిన సొమ్ము దాచిందెక్కడ?

కార్మిక శాఖ పరిధిలోని బీమా వైద్య సేవల(ఐఎంఎస్‌) విభాగంలో చోటు చేసుకున్న కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం నగరంలోని ఏడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.4 కోట్ల నగదు, నగలు స్వాధీనం చేసుకున్న ఈడీ వర్గాలు.. తాజాగా పలువురికి సమన్లు జారీ చేశాయి. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, డొల్ల ఫార్మా కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్‌రెడ్డి, నాయిని వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి బంధువు వినయ్‌రెడ్డి, ఐఎంఎస్‌ మాజీ సంచాలకురాలు దేవికారాణి, ఓమ్ని మెడి సంస్థ నిర్వాహకుడు కంచర్ల శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ పది రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. మంట నూనెలు

వంట నూనెల ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. గతేడాది చివరి నుంచి మొదలైన నూనెల మంటలు ఇంకా చల్లారలేదు. రబీలో వేసిన వేరుసెనగ విక్రయాలు పూర్తి కావొస్తున్నాయి. నూనె ధర మాత్రం మండుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో లీటరు వేరుసెనగ నూనె రూ.175, పామోలిన్‌ రూ.130పైనే విక్రయిస్తున్నారు. పప్పుల ధరలు కూడా చురుక్కుమనిపిస్తున్నాయి. మధ్యతరగతి వినియోగదారుడిపై భారం మోపుతున్నాయి. కొత్త పంట రాకతో ఉల్లి ధరలు దిగిరావడం కాస్త ఉపశమనాన్నిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. నా షాట్లు నేనాడా.. పొడగరి బౌలర్లు మరి!

తొలి విజయం సాధించడం ఆనందంగా ఉందని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అంటున్నాడు. తాము మరికొన్ని పరుగుల్ని నియంత్రిస్తే బాగుండేదని డేవిడ్‌ వార్నర్‌ పేర్కొన్నాడు. బంతులు అనకూలంగా రావడంతో చితకబాదేశానని నితీశ్‌ రాణా తెలిపాడు. వేగంగా బౌలింగ్‌ చేసేందుకు అత్యుత్తమంగా ప్రయత్నిస్తున్నానని పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ వెల్లడించాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ పోరులో కోల్‌కతా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ 10 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

* రాణా ధనాధన్‌

7. కొవిడ్‌పై అవగాహనకు ప్రత్యేక గేమ్‌

కరోనా ప్రబలిన తరుణంలో ఐక్యంగా ఉండటం ద్వారా ఎలా ఎదుర్కోవచ్చు? దేశాల మధ్య సహకారం ఎలా ఉండాలి? వైరస్‌ వ్యాప్తితో ప్రజల ఆరోగ్యంపై ఎలా ప్రభావితమవుంది? ఇలాంటి విషయాలపై చిన్నారుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ట్రిపుల్‌ఐటీ ఆచార్యులు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ గేమ్‌ను రూపొందించారు. అగస్త్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభ కలిగిన 70 మంది చిన్నారులను ఎంపిక చేసి 15 రకాల అంశాలపై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తోంది. కొవిడ్‌ తరుణంలో నగరాలు, దేశాలు వ్యవహరించాల్సిన తీరుపై కూడా శిక్షణ ఇస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. వాలంటీర్ల ప్రచారం

తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పలువురు వాలంటీర్లు ముఖ్యమంత్రి జగన్‌ సంతకం, సందేశంతో పంపిన లేఖలను స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచుతున్నారు. వైకాపా నేతల సూచనల మేరకు గడపగడపకు వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు. కొందరైతే ఏకంగా వైకాపా నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్లతో మంత్రులు, ప్రచారాన్ని పర్యవేక్షించడానికి నియమితులైన ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అలాంటి సవాళ్లే నాకు కావాలి

పాత్రల్లో కొద్దిమంది నటిస్తారు. కొద్దిమందే జీవిస్తారు. ఇందులో రెండో రకం... నివేదా థామస్‌. తెరపైన పాత్రలు తప్ప... నివేదా అనే విషయం ఎప్పుడో కానీ గుర్తుకురాదు. ‘వకీల్‌సాబ్‌’లో వేముల పల్లవి... ఆమె సంఘర్షణ, ఆమె పోరాటమే కనిపిస్తుంది. ఎక్కడా ఇది పాత్ర, ఇది నటన అని ఎప్పుడూ అనిపించదు. నివేదా అంత సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సందర్భంగా నివేదా థామస్‌తో ‘ఈనాడు సినిమా’ ముచ్చటించింది. ఆమె చెప్పిన విషయాలివీ... మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. రాణా ధనాధన్‌

సన్‌రైజర్స్‌కు భంగపాటు. కోల్‌కతా మురిసింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో ఐపీఎల్‌-14ను విజయంతో ఆరంభించింది. నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి విధ్వంసానికి బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ తోడైన వేళ.. సన్‌రైజర్స్‌ను మట్టికరిపించింది. బెయిర్‌స్టో ఆశలు రేపినా.. అవకాశాన్ని వార్నర్‌ సేన ఉపయోగించుకోలేకపోయింది. మనీష్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచినా.. ఆఖర్లో విజయానికి అవసరమైన దూకుడు అతడిలో కొరవడింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని