close

తాజా వార్తలు

Published : 15/04/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. అదే బాటలో రాష్ట్రం!

కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) పది వార్షిక పరీక్షలను రద్దుచేసి, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయడంతో తెలంగాణ రాష్ట్రం కూడా అదే బాటలోనే నడిచే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి పరీక్షలు జరపకుండా పరీక్ష ఫీజులు చెల్లించిన అందర్నీ పాస్‌ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌ పరీక్షల విషయమై చర్చించేందుకు గురువారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఇంటర్‌బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఆరుగురిని హత్యచేసిన ఆగంతకుడు

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో దారుణం జరిగింది. ఓ ఆగంతకుడు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్యచేసిన ఘటన కలకలం రేపింది. ఈతెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న వారిపై ఆగంతకుడు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చినట్టుగా తెలుస్తోంది. మృతదేహాలన్నీ ఇంట్లో రక్తపు మడుగులో పడిఉన్నాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్‌ర్‌ఐ కుటుంబం అనుమానాస్పద మృతి

విశాఖ నగరం మధురవాడ మిథిలాపురికాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఎన్‌ఆర్‌ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. ఆదిత్య టవర్స్‌లోని ఐదో అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 8 నెలల క్రితం ఈ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మళ్లీ సోకినా తీవ్రత తక్కువే

నిమ్స్‌లో ఒక స్టాఫ్‌నర్సుకు ఆరునెలల కిందట మొదటిసారి కొవిడ్‌ సోకింది. అక్కడే చికిత్స పొందగా నయమైంది. రెండు డోసుల కొవిడ్‌ టీకాలను కూడా స్వీకరించారు. ఇటీవల ఆ స్టాఫ్‌నర్సు మళ్లీ కరోనా బారినపడ్డారు. అయితే స్వల్ప చికిత్సతోనే ఆమె కోలుకున్నారు. అలాగే పోలీసు శాఖలో నలుగురికి రెండోసారి కరోనా సోకింది. ఇలా ఒకసారి కొవిడ్‌ సోకిన వారిలో సుమారు 5 శాతం లోపు వ్యక్తులు రెండోసారి వైరస్‌ బారినపడుతున్నారు. రెండుడోసుల టీకాలు పొందిన వారిలోనూ ఒక శాతం లోపు మళ్లీ మహమ్మారి కోరలకు చిక్కుకుంటున్నారు. అయితే కరోనా వైరస్‌ ఒకే వ్యక్తికి రెండుసార్లు సోకడం అసాధారణమేమీ కాదంటున్నారు వైద్య నిపుణులు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. కోహ్లీ ఆవేశం: రిఫరీ మందలింపు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచులో అతడు ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘించడమే ఇందుకు కారణం. ఈ మ్యాచులో విరాట్‌ 29 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 33 పరుగులు చేశాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్‌ వేసిన 12.1వ బంతిని అతడు భారీ షాట్‌ ఆడాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి గాల్లోకి లేచింది. లాంగ్‌ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌ విజయ్‌ శంకర్‌ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేసి ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. డివైడర్‌ను ఢీకొన్న బస్సు: 25 మందికి గాయాలు

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌ చెరువు వద్ద ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళుతున్న కంటెయినర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ సమయంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. మాయదారి కరోనా వాయిదాల.. కలవరం

కొన్ని నెలలుగా ఎక్కడా లేని రీతిలో తెలుగులో కొత్త సినిమాలు విడుదలవుతూ వచ్చాయి. ఏడెనిమిది  సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన శుక్రవారాలూ కనిపించాయి. కరోనా తర్వాత ఎక్కడా ఇన్ని సినిమాలు విడుదల కాలేదని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని  కీర్తిస్తూ వచ్చిన సినీ వర్గాల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. కరోనా ఉద్ధృతితో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తున్నాయి. విడుదల కోసం ముందే తేదీల్ని ఖరారు చేస్తూ కట్చీఫ్‌ వేసుకున్న సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. గాడిన పడిందనుకున్న చిత్రసీమలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఉగ్ర నీడలో అన్నదమ్ములు

వారిద్దరూ అన్నదమ్ములు. ఒకరేమో భారత నౌకాదళ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేయడంలో కీలకపాత్ర పోషించగా.. మరొకరు సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని శత్రు దేశాలకు అందించారు. చివరికి ఇద్దరూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు చిక్కి కటకటాల్లోకి వెళ్లారు. విశాఖపట్నం గూఢచర్య రాకెట్‌ కేసులో గతంలో పట్టుబడ్డ ఇమ్రాన్‌ గిటేలీ.. ఉత్తర్‌ప్రదేశ్‌ గూఢచర్య రాకెట్‌ కేసులో తాజాగా అరెస్టైన అనస్‌ గిటేలీల ఉగ్ర కథ ఇది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. నెలకు 78 లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ తయారీ!

దేశంలో కొవిడ్‌ కొత్త కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, అత్యవసర చికిత్సలో వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని రెట్టింపు కంటే పెంచే చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ ఔషధ లభ్యతపై కేంద్ర రసాయనాలశాఖ సహాయమంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవ్య తయారీ సంస్థలతో సమీక్షించారు. ఇంజెక్షన్‌ రూపంలో ఆసుపత్రిలో మాత్రమే ఈ ఔషధాన్ని రోగులకు ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 7 సంస్థల వద్ద కలిపి, నెలకు 38.80 లక్షల వయల్స్‌ తయారుచేసే సామర్థ్యం ఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. నిబంధనలు గాలికి.. లక్షల మంది రాజస్నానం

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో బుధవారం జరిగిన ‘రాజ స్నానం’ (శాహీ స్నాన్‌) కార్యక్రమానికి లక్షల మంది తరలివచ్చారు. దేశంలో ఓ వైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలనూ తీసుకోలేదు. కుంభమేళాలో ప్రధాన ఘట్టమైన ఈ కార్యక్రమానికి వేల మంది సాధువులు వచ్చి హర్‌ కీ పౌరీ ఘాట్‌ వద్ద గంగానదిలో పవిత్రస్నానాలు చేయడం విశేషం. మొత్తం 13 అఖాడాల సాధువులు ఇందులో పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని