టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

తాజా వార్తలు

Published : 01/04/2021 20:59 IST

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది. ఈనెల 8న పోలింగ్‌ నిర్వహించి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. బెంగాల్‌లో 80%.. అసోంలో 74% పోలింగ్‌  

బెంగాల్‌, అసోంలో రెండో దశ పోలింగ్‌ ముగిసింది. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు పూర్తయ్యాయి. భాజపా, తృణమూల్‌ కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఓటర్లు చైతన్యాన్ని చాటారు. భారీ సంఖ్యలో  పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరగగా సాయంత్రం 7గంటల వరకు 80.43శాతం ఓటింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. మహారాష్ట్ర: నెలలో 6 లక్షల కొత్త కేసులు..

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే రావడం కలవరపెడుతోంది. కేవలం మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో 6 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కాగా మార్చిలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో అన్ని రకాల వయసుల వారూ వైరస్‌ బారిన పడ్డట్లు తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. అక్కడ ర్యాపిడ్‌ టెస్ట్‌ రూ. 150

 దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మరోసారి మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. దీంతో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ రుసుమును తగ్గిస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.150లకే ర్యాపిడ్ యాంటీజెన్‌ టెస్టు చేయనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. సీఎంపై కామెంట్‌.. ఎ.రాజాపై ఈసీ ఆంక్షలు!  

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై వ్యక్తిగత దూషణకు పాల్పడిన డీఎంకే ఎంపీ ఎ.రాజాపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారంలో 48గంటల పాటు ఆయన పాల్గొనరాదని ఆదేశించింది. తమిళనాడు సీఎంపై రాజా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటమే కాకుండా మహిళల హుందాను దిగజార్చేలా ఉన్నాయని మండిపడింది. ఇది ఎన్నికల కోడ్‌ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని తెలిపింది. డీఎంకే స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా నుంచి రాజా పేరును తొలగించింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఎన్‌ఐఏ సోదాలు.. కీలక ఆధారాలు లభ్యం

తెలుగు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో ఉన్న పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌, మెదక్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. సోదాల్లో 40 సెల్‌ఫోన్లు, 44 సిమ్‌ కార్డులు, 70 హార్డ్‌డిస్క్‌లు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్‌డ్రైవ్‌లు, ఆడియో రికార్డర్స్, ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు, ప్రెస్‌ నోట్లతో పాటు రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు వివరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. హత్య చేసి.. ఫ్రిజ్‌లో పెట్టి..

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కార్మిక నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్న 38ఏళ్ల సిద్దిఖ్ అహ్మద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఉన్న ఫ్రిజ్‌లో ఉంచి ఇంటిబయట తాళం వేసి వెళ్లిపోయారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్ యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఎప్పుడూ ప్రైవేటు మోడ్‌లోనే..

ఇంట్లో సిస్టం వాడుతున్నప్పుడు పెద్దగా బ్రౌజింగ్‌లో గోప్యత గురించి ఆలోచించంగానీ.. ఆఫీసు లేదా ఇంటర్నెట్‌ సెంటర్లలో పీసీలను వాడేటప్పుడు అవసరం అనుకుంటే.. ప్రైవేటు బ్రౌజింగ్‌ వైపు మొగ్గు చూపుతాం. అందుకు అన్ని బ్రౌజర్‌లలో ‘ఇన్‌కాగ్నిటో మోడ్‌ ఉంటుంది. అవసరం అయినప్పుడల్లా ఆన్‌లైన్‌ ప్రైవసీని కాపాడుకుంటూ వెబ్‌ విహారం చేస్తుంటాం. ఇన్‌కాగ్నిటోని ఓపెన్‌ చేసింది మొదలు తిరిగి క్లోజ్‌ చేసేంత వరకూ ఎలాంటి బ్రౌజింగ్‌ హిస్టరీ సిస్టమ్‌లో సేవ్‌ అవ్వదు. ఇన్‌కాగ్నిటో షెషన్‌ క్లోజ్‌ చేయగానే కూకీస్‌, క్యాషే.. లాంటి ఇతర వివరాలు క్లియర్‌ అయిపోతాయి. అందుకే ఎప్పుడు అవసరం అయినా.. బ్రౌజర్‌ ఏది వాడుతున్నా.. ఇన్‌కాగ్నిటోలో వాలిపోతాం. ఇంతటి ప్రాధాన్యతనిచ్చే ఇన్‌కాగ్నిటోని ఆండ్రాయిడ్‌లో శాశ్వతంగా పెట్టుకుంటే? అంటే.. బ్రౌజర్‌ని ఓపెన్‌ చేయగానే డీఫాల్ట్‌గా ప్రైవేటు మోడ్‌లో వచ్చేస్తే! అదెలా సాధ్యం అనే సందేహం అక్కర్లేదు. అందుకో చిట్కా ఉంది. ఫాలో అయిపోండి.. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.రాహుల్‌ ‘దూకుడు’ చూస్తారు: జాఫర్‌ 

ఈ ఐపీఎల్‌ సీజన్లో కేఎల్‌ రాహుల్‌ దూకుడుగా ఆడటం చూస్తారని పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ వసీమ్‌ జాఫర్‌ అన్నాడు. మాక్స్‌వెల్ ఫామ్‌లేమి, ఐదో నంబర్‌ తర్వాత విధ్వంసకరంగా ఆడేవాళ్లు లేకపోవంతో గతేడాది నిలకడగా ఆడాడని పేర్కొన్నాడు. ఈ సారి జట్టు మరిత సమతూకంగా ఉందన్నాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌ 14 మ్యాచుల్లో 670 పరుగులు చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ప్రణీత బర్గర్‌ కష్టాలు..అనసూయ రీమిక్స్‌ డైలాగ్‌

 ప్రతిరోజుని రంగులమయంగా మార్చుకోండి అంటున్నాడు విజయ్‌ దేవరకొండ. సప్తవర్ణాల్లో లభ్యమయ్యే స్కిటిల్‌ బిళ్లలు తింటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బర్గర్‌ తింటోన్న ఫొటోని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు నటి ప్రణీత సుభాష్‌. ‘పయనంపై దృష్టి పెట్టండి. గమ్యం మీద కాదు’ అని చెప్పుకొచ్చింది కథానాయిక లక్ష్మీ రాయ్‌. ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్‌ తను పెంచుకుంటోన్న కుక్క షెర్లాక్‌ని పరిచయం చేశారు. ఇన్‌స్టా రీల్స్‌ రీమిక్స్‌ లైవ్‌లో పాల్గొని లావణ్య త్రిపాఠి డైలాగ్‌తో ఆకట్టుకుంటోంది వ్యాఖ్యాత, నటి అనసూయ. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని