Top Ten News @ 1 PM

తాజా వార్తలు

Updated : 08/06/2021 13:30 IST

Top Ten News @ 1 PM

1. Wuhan Lab: అమెరికాకు ఏడాది క్రితమే తెలుసా?

చైనా ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకవ్వడం వల్లే కొవిడ్‌ మహమ్మారి ఉత్పన్నమై ఉంటుందన్న వాదనను విశ్వసించొచ్చని అమెరికా ప్రభుత్వ అధీనంలోని లారెన్స్ లివర్‌మోర్‌ జాతీయ లేబోరేటరీ 2020 మే నెలలోనే నిర్ధారించినట్లు సమాచారం. దీనిపై మరింత లోతైన విచారణ జరపాలని కూడా ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన నివేదికలోని కీలక అంశాలను తాజాగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP News: అలా చేయకపోతే ప్రభుత్వాలు ఫెయిల్‌ అయినట్లే: జగన్‌

‘జగనన్న తోడు’ పథకం కింద రెండో ఏడాది నిధులను ఏపీ సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తి కళాకారులకు రూ.370 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని.. గత్యంతరం లేక వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తీసుకుని వారు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. వ్యవస్థలను పేదవాడికి ఉపయోగపడేలా తీసుకురాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్‌ అయినట్లేనని జగన్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP News: ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

3. గాంధీజీ మునిమనవరాలికి 7ఏళ్ల జైలుశిక్ష

భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవరాలు ఆశిష్‌ లతా రాంగోబిన్‌ దక్షిణాఫ్రికాలో మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. గాంధీజీ మనవరాలు, దక్షిణాఫ్రికాలోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె లతా రాంగోబిన్‌.. అహింసపై ఏర్పాటైన ఓ ఎన్జీవోలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Corona: పిల్లలకు మూడో ముప్పు.. స్పష్టత లేదు!

గతఏడాది కాలంలో రెండు దఫాలుగా విజృంభించిన కరోనా మహమ్మారి చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే మూడోదశలో మాత్రం వారికి ముప్పు ఎక్కువగా ఉంటుందనే నిపుణుల అభిప్రాయాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకు తగ్గట్టుగా అప్రమత్తం అవుతున్నాయి. అయితే తదుపరి దశలో కరోనాతో పిల్లలకు ముప్పు పొంచి ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం వెల్లడించింది. దీనిపై ప్రధాని కొవిడ్ నిర్వహణ బృందంలో ఒకరైన వీకే పాల్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Vaccine: మీ టీకా తీసుకున్నాం కదా.. చైనా రానివ్వండి

5. Mehul Choksi: ఆ అమ్మాయి ట్రాప్‌ చేసింది 

నమ్మిన అమ్మాయే తనను ట్రాప్‌ చేసి ఎత్తుకెళ్లటానికి సాయం చేసిందని.. కోట్ల రూపాయలు కొల్లగొట్టి, దొరక్కుండా వెళ్లిన భారత నగల వ్యాపారి మెహుల్‌ చోక్సీ ఆరోపించారు. ఆంటిగ్వ్వా నుంచి తనను స్థానిక పోలీసులు, కొంతమంది కిరాయి దుండగులు కిడ్నాప్‌ చేసి డొమినికాకు తీసుకొచ్చారన్నారు. ఈ మేరకు ఆంటిగ్వా రాయల్‌ పోలీసులకు చోక్సీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Akhilesh: ఆ టీకా వద్దన్నా.. ప్రభుత్వానిది కాదు

కరోనా వ్యాక్సిన్‌ను ‘భాజపా టీకా’గా పేర్కొన్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తాజాగా తాను వ్యాక్సిన్‌ తీసుకుంటానని ప్రకటించారు. తాము భాజపా టీకాలకు మాత్రమే వ్యతిరేకమని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే టీకాలను వేసుకుంటామని అన్నారు. వ్యాక్సిన్‌ విధానంలో మార్పులపై ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ అఖిలేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: లక్ష దిగువకు కరోనా కేసులు

7. Krishnapatnam: సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఔష‌ధం త‌యారీ సామ‌గ్రి త‌దిత‌రాల‌కు స‌హ‌కారం అందించాల‌ని విన్న‌వించారు. ఎక్కువ మొత్తంలో మందును త‌యారు చేసి ఇత‌ర రాష్ట్రాల‌కు పంపిణీ చేసే విధంగా స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని కోరారు. మందు తయారీకి విద్యుత్ సౌక‌ర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాల‌ని ఆనంద‌య్య లేఖ‌లో పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో వైపు.. ఇవాళ నెల్లూరు జిల్లాలోని మునుబోలు మండ‌లంలో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. MS Dhoni: ధోనీకి బ్యాటింగ్‌ రాదనుకున్నా!

దిగ్గజ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీకి బ్యాటింగ్‌ చేయడం రాదనుకున్నానని దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ ఆన్రిచ్‌ నార్జ్‌ అన్నాడు. అప్పటికి మహీ గురించి తనకు పూర్తిగా తెలియదని పేర్కొన్నాడు. క్రీజులో పాదాలను సరిగ్గా కదిలించకపోవడంతో అలా భావించానని తెలిపాడు. అప్పుడు తాను అండర్‌-16 విభాగంలో ఆడుతున్నానని వివరించాడు. నార్జ్‌ చెప్పిన ఈ సంగతి 2010 నాటిది. ఆ ఏడాది దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్‌ టీ20 లీగ్‌ జరిగింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ అందులో ఆడింది. అప్పుడు సీఎస్‌కేకు 16 ఏళ్ల నార్జ్‌ నెట్స్‌లో బౌలింగ్‌ చేశాడు. ప్రస్తుతం అతడు దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 * WTC Finals: నిలిచారు దంచికొట్టారు..! 

9. Amitabh: విల‌న్‌గా ర‌జ‌నీ వ‌ద్ద‌న్నారు

అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్‌.. దేశం గ‌ర్వించద‌గ్గ న‌టులు. మ‌రి ఈ ఇద్ద‌రూ క‌లిసి ‘రోబో’ చిత్రంలో క‌నిపిస్తే ఎలా ఉండేది? అది కూడా ఒక‌రు హీరోగా, మ‌రొక‌రు విల‌న్‌గా. ఊహించ‌డానికే ఎంతో బాగుంది క‌దా! అయితే ఈ కాంబినేష‌న్ సెట్ చేసేందుకు ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ర‌జ‌నీ మాట వ‌ల్ల అది కార్యరూపం దాల్చ‌లేదు.అస‌లేం జ‌రిగిందంటే.. ‘రోబో’ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషించ‌మ‌ని అమితాబ్‌ను అడిగారు శంక‌ర్‌. ఇదే విష‌య‌మై ర‌జ‌నీకాంత్‌కు అమితాబ్‌ ఫోన్ చేసి అడ‌గ్గా..  ప్రేక్ష‌కులు మిమ్మ‌ల్ని విల‌న్‌గా అంగీక‌రించ‌లేరు, ఈ పాత్ర చేయొద్దు అని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: కమలాపూర్‌లో ఈటల రోడ్‌షో

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఆయ‌న తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు. పర్యటనలో భాగంగా కమలాపూర్‌ మండలంలో ద్విచక్రవాహనాలతో ఆయన అభిమానులు రోడ్‌షో చేపట్టారు. శంభునిపల్లి, కానెపర్తి గ్రామాల మీదుగా రోడ్‌షో కొనసాగింది. ఈటల మద్దతుదారులు, అభిమానులు, యువకులు ‘జై-ఈటల’ నినాదాలతో హోరెత్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* HYD: రామ్‌నగర్‌ చేపల మార్కెట్‌లో భారీ రద్దీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని