Top Ten News @ 1 PM
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 13:09 IST

Top Ten News @ 1 PM

1. పాంగాంగ్‌ సరస్సులోకి కొత్త పడవలు..!

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా దాదాపు 17 మర పడవల కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఆర్డర్‌ను కూడా గోవాలోని ఒక నౌకల తయారీ కంపెనీకి ఇచ్చినట్లు సమాచారం.  ఈ ఏడాది మార్చిలో పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందుకోసం పలు దఫాలుగా ఇరు దేశాల కోర్‌ కమాండర్లు భేటీ అయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Raghurama: పొరపాటా?కావాలనేనా?: రఘురామ

వైకాపా అధికారిక‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి తన పేరును తొల‌గించ‌డంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. వైకాపా త‌ర‌ఫున గెలిచిన త‌న పేరును తొలగించ‌డంపై అందులో ప్ర‌స్తావించారు. వైకాపా నుంచి త‌న‌ను బ‌హిష్క‌రించారా? అని ఎంపీ సందేహం వ్య‌క్తం చేశారు. పొర‌పాటున‌ పేరు తొల‌గించారా? లేక కావాల‌నే చేశారా? అనే విష‌యంపై స్పష్టత ఇవ్వాలని జ‌గ‌న్‌ను కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Raghurama: ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ ఏదీ?: రఘురామ

3. Vaccine: అమెరికాలో టీకా ‘గడువు’ ప్రమాదం

భారత్‌ సహా ప్రపంచంలో అత్యధిక దేశాలు వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బంది పడుతుంటే అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు సగం జనాభా టీకాలు వేసుకున్నా, మిగతా వారు అంతగా ఆసక్తి చూపకపోవడంతో టీకాల గడువు (ఎక్స్‌పైరీ) ముగిసే ప్రమాదం పొంచి ఉంది. దీంతో లక్షలాది డోసులు వృథా అయ్యే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. టెన్నెసీ, నార్త్‌ కరోలినాలు ఇప్పటికే మిలియన్ల కొద్దీ డోసులను ఫెడరల్‌ ప్రభుత్వానికి తిరిగి పంపించాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మహమ్మారులకు తొలి 100 రోజుల్లోనే కళ్లెం 

భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు వైరస్‌లు వ్యాప్తి చెందకుండా కళ్లెం వేసే చర్యల్లో భాగంగా బ్రిటన్‌లో ‘జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం’ ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఎప్పుడు కొత్త రకం వైరస్‌ బయటపడినా దానిని కీలకమైన తొలి 100 రోజుల్లోనే నియంత్రించగలిగేలా వివిధ రకాల చర్యలు చేపట్టాలని జి-7 దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ‘ప్రపంచ ఆరోగ్య ప్రకటన’ను ఆదివారం వెలువరించనున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌ దేశాలతో పాటు భారత్‌ సహా వర్చువల్‌ విధానంలో పాల్గొంటున్న ఇతర దేశాలూ దీనికి అంగీకారం తెలిపాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

G-7: ఒకే భూగ్రహం-ఒకే ఆరోగ్య వ్యవస్థ..మోదీ పిలుపు

5. ఒక్క డోసుతో 24 గంటల్లో కోలుకున్నారు!

కరోనా చికిత్సకు భారత్‌లో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌’ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)’లో 40 మంది కొవిడ్‌ బాధితులకు ఇటీవల ఈ డ్రగ్‌ ఇచ్చినట్లు ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. వారంతా జ్వరం సహా ఇతర అనారోగ్య లక్షణాల నుంచి 24 గంటల్లో కోలుకున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల్లో వైరస్‌ సైతం పూర్తిగా కనుమరుగైనట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Cinema News: నటి అనిత షాకింగ్‌ నిర్ణయం

‘నువ్వు నేను’తో కథానాయికగా తెరంగేట్రం చేసి తెలుగు వారికి చేరువైన ముంబయి ముద్దుగుమ్మ అనిత తన అభిమానుల్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేశారు. ఇటీవల తల్లైన ఆమె.. నటనకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇకపై తాను ఇంట్లోనే ఉండి.. తన బిడ్డ ఆరవ్‌ సంరక్షణ చూసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను’ అని అనిత ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సంగీతంతో ఆ బాధ మాయమైంది

7. Dhoni: చిన్నిగుర్రంతో ధోనీ ఆటలు..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి మళ్లీ ఖాళీ సమయం దొరకడంతో రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో సేదతీరుతున్నాడు. గతనెల ఓ చిన్న గుర్రానికి మసాజ్‌, స్నానం చేయించిన ధోనీ.. తాజాగా మరో చిన్న గుర్రంతో ఆటలాడాడు. దానితో పరుగులు తీస్తున్న వీడియోను అతడి సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా లక్షలాది మంది అభిమానులు లైకులు కొడుతున్నారు. ధోనీ గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సారథిగా కొనసాగాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Corona : 80 వేలకు దిగివచ్చిన కేసులు!

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు లక్షకు దిగువనే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 80,834 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 2 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసుల నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Vaccine: సాధారణ టీకాలకు దూరమవుతున్న పిల్లలు

9. KCR: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం సమీక్ష

అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. పల్లె, పట్టణ ప్రగతిపై కార్యక్రమంపై ఆయన కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే ఈ కార్యక్రమానికి ఆర్థిక సంఘంతో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిపి ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అమలు తీరుపై సీఎం సమీక్షిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: నిబంధనలకు విరుద్ధంగా బర్త్‌డే పార్టీ

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో నిబంధనలకు విరుద్ధంగా బర్త్‌డే పార్టీ జరిగింది. ఓ ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి యువత మద్యం తాగి చిందులేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. ఈ వేడుకల్లో 70మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఘటనాస్థలంలో భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని