Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 02/08/2021 12:58 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Krishna Water Issue: వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి: సీజేఐ

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్‌ న్యాయవాదులకు సీజేఐ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Third Wave: మూడో ముప్పులో గరిష్ఠంగా ఎన్ని కేసులు రానున్నాయంటే..?

కరోనా రెండో ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ.. మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదు. ముంగిట పొంచి ఉన్న మూడో దఫా విజృంభణపై ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు తగ్గట్టే కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇందులో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రల్లోనే వెలుగుచూస్తుండగా.. 40కిపైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతోంది. ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఓ అధ్యయనం మూడో ముప్పు వేళ ఎన్ని కేసులు వెలుగుచూడనున్నాయో ఓ అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Ashwagandha: కరోనా చికిత్సలో అశ్వగంధ.. బ్రిటన్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌

3. Masood Azhar: లాడెన్‌లా చనిపోకూడదని.. రక్షణ కల్పిస్తోన్న పాక్‌!

ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ భూతల స్వర్గం. ఒసామా బిన్‌ లాడెన్‌ సహా ఎంతో మందికి ఆ దేశం ఆశ్రయమిచ్చింది. రక్షణ కల్పించింది. ఇప్పుడు జైషే మహమ్మద్‌ అధిపతి.. 2001 భారత్‌ పార్లమెంట్‌పై దాడి సహా పలు ఉగ్రదాడుల్లో ప్రధాన కుట్రదారుడైన మసూద్‌ అజార్‌ను పాక్‌ ప్రభుత్వం తన అతిథిగా చూసుకుంటోంది. మతం పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఈ కరడుగట్టిన ఉగ్రవాదికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం అజార్‌..బహవల్‌పుర్‌లో రెండు విలాసవంతమైన భవంతుల్లో నివాసం ఉంటున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Tokyo Olympics: 3సార్లు విజేత చిత్తు.. సెమీస్‌కు భారత మహిళల హాకీ జట్టు

మళ్లీ స్వర్ణయుగం రాబోతోందా? ఒకప్పుడు భారత హాకీ జట్టు మైదానంలో అడుగు పెడుతోందంటే హడల్‌! ప్రపంచ దేశాలు వణికిపోయేవి. టీమ్‌ఇండియా దిగ్గజాలను ఎదుర్కొనేందుకు భయపడేవి. ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు కొల్లగొట్టిన ఘన చరిత్ర మనది. ఏమైందో ఏమో! దిగ్గజాల నిష్క్రమణతో భారత హాకీ ప్రాభవం కోల్పోయింది. ఓటముల పరంపర వెక్కిరించింది. మధ్యలో కొందరు గొప్ప ఆటగాళ్లు అవతరించినా బృందంగా మాత్రం విఫలమయ్యేవాళ్లు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Tokyo olympics: షూటింగ్‌లో మరోసారి నిరాశ.. 200మీ. పరుగులో ద్యుతీ ఓటమి

5. Mutual Fund SIP: ఒక్క ‘సిప్‌’తో రూ.10 కోట్లు సంపాదించొచ్చని తెలుసా?

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌లో పెట్టుబ‌డులు పెడితే రూ.10 కోట్లు సంపాదించ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా? అవును ఇది సిప్‌తో సాధ్యం. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చేసే పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో మంచి లాభాల‌ను తెచ్చిపెడ‌తాయి. 12 శాతం రాబ‌డి అంచ‌నాతో 25 ఏళ్ల పాటు పెట్టుబ‌డితే పెడితే ఆర్థికంగా మెరుగైన‌ జీవ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన మ‌రో విష‌యం ఏంటంటే మీ వ‌ద్ద ఒకేసారి పెద్ద మొత్తంలో డ‌బ్బు లేక‌పోయినా మీకు ఉన్న‌దాంట్లో నెల‌కు కొంత సిప్‌లో డిపాజిట్ చేస్తుంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Lakshdweep: లక్షద్వీప్‌లో మాల్దీవుల తరహా నీటి విల్లాలు

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన లక్షద్వీప్‌లో త్వరలోనే మరో ప్రత్యేక ఆకర్షణ రానుంది. మాల్దీవుల తరహాలో విలాసవంతమైన నీటి విల్లాలు ఇక్కడ ఏర్పాటుకానున్నాయి. దేశంలోనే తొలిసారిగా రూ.800 కోట్ల వ్యయంతో లక్షద్వీప్‌లోని మినీకాయ్, కద్‌మత్, సుహేలీ దీవుల్లో మూడు నీటి విల్లా ప్రాజెక్టులు నిర్మించాలని అక్కడి పాలన యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం గ్లోబల్‌ టెండర్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ISRO: ఉపగ్రహ దిక్సూచి రంగానికి మహర్దశ

7. Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

ఇటీవల థియేటర్లు తెరుచుకోవడంతో ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. గతవారంలాగే ఈ వారం కూడా థియేటర్‌తో పాటు, ఓటీటీల్లోనూ పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్న నేపథ్యంలో పెద్ద చిత్రాలు రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు తొలివారంలో థియేటర్‌/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలేంటో చూసేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. pv sindhu: ఒలింపిక్స్‌ కోసం ఎంతో కష్టపడ్డా: పీవీ సింధు

తాజా ఒలింపిక్స్‌ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కాంస్యం గెలవడం సంతోషంగా ఉందని స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, పీవీ సింధు అన్నారు. సోమవారం ఆమె టోక్యో నుంచి కోచ్‌ పార్క్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో నా బలహీనతలపై దృష్టి పెట్టా. నాకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌ పార్క్‌ ఎంతో కష్టపడ్డారు. డిఫెన్స్‌ మెరుగుపరుచుకోవడంతోనే పతకం సాధ్యమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

PV Sindhu: సింధు.. ప్రధానితో కలిసి కచ్చితంగా ఐస్‌క్రీం తింటుంది!

9. Corona: ఉద్ధృతి కొద్దిగా తగ్గినా.. 40వేల పైనే కొత్త కేసులు

 దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 14,28,984 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే 4 శాతం మేర తగ్గాయి. కేరళలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ మళ్లీ 20వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇక నిన్న 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.16 కోట్లకు చేరగా.. 4.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. e-RUPI: డిజిటల్‌ చెల్లింపుల్లో మరో ముందడుగు.. ‘ఇ-రూపీ’

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వీటిని మరింత సులభతరం చేసే మరో సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. అదే ‘ఇ-రూపీ’. దీన్ని సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Mumbai: ప్లీజ్‌.. ఇక్కడ ముద్దులు పెట్టుకోవద్దు..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని