Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 17/09/2021 13:01 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. YSRCP Protest: చంద్రబాబు నివాసం వద్ద వైకాపా నేతల ఆందోళన

ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ సంస్మరణ సభలో తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ సహా పలువురు నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ప్రధాన ద్వారం ముందు జోగి రమేశ్‌, వైకాపా కార్యకర్తలు బైఠాయించారు. దీంతో తెదేపా- వైకాపా కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Chandrababu: తితిదే జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలి: చంద్రబాబు

2. GST: ప్రారంభమైన జీఎస్‌టీ సమావేశం.. అజెండాలో ‘పెట్రోల్‌, డీజిల్’

వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి 45వ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన లఖ్‌నవూలో జరుగుతోన్న ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య అధికారులు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. దాదాపు 20 నెలల తర్వాత మండలి సమావేశం మళ్లీ ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2019 డిసెంబరు 18 తర్వాత నుంచి జీఎస్‌టీ మండలి పలు సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. TS News: డీజీపీ ఎదుట మావోయిస్టు శారదక్క లొంగుబాటు

మావోయిస్టు నేత బజ్జర సమ్మక్క అలియాస్‌ శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా గంగారం. 1994లో పీపుల్స్‌ వార్‌ పార్టీకి ఆమె ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Oil Purify Test: చిన్న ప్రయోగంతో కల్తీ నూనెని కనిపెట్టొచ్చు

మన వంటకాల్లో ఎక్కువగా వినియోగించే పదార్థాల్లో నూనె ఒకటి. గత కొద్ది సంవత్సరాలుగా మార్కెట్లో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. దీన్ని అసరాగా తీసుకొని మోసగాళ్లు నూనె కల్తీ చేసి విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల్లో కల్తీ అనేది ప్రధాన సమస్యగా మారింది. ఆహార కల్తీ వల్ల మనకు తెలియకుండానే పలు రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా వంటనూనెలో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Investments: పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 ప్రశ్నలు సంధించుకోండి!

మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగపడే పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం అంత సులభమేం కాదు! డబ్బును మదుపు చేయడానికి చాలా మార్గాలున్నాయి. ప్రతి దాంట్లో కొన్ని సవాళ్లుంటాయి. అయితే, మీకు సరిపడే పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిలో ఒకటి మిమ్మలి మీరు కొన్ని ప్రశ్నలు సంధించుకోవడం. ఆ ప్రశ్నలేంటో చూద్దాం..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* FD Interest Rates: ప్ర‌ముఖ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు ఇలా..

6. Maestro Review: రివ్యూ: మాస్ట్రో

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు నితిన్‌. ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలతో అలరించిన ఆయన ముచ్చటగా మూడో చిత్రం ‘మాస్ట్రో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘అంధాదున్‌’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రలో నితిన్‌ ఎలా నటించారు? తెలుగు రీమేక్‌లో దర్శకుడు మేర్లపాక గాంధీ ఏ మార్పులు చేశారు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. India Corona: మరోసారి పెరిగిన కొత్త కేసులు 

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 30 వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. తాజాగా 12.5 శాతం మేర పెరిగి 34 వేలకు చేరాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది. 24 గంటల వ్యవధిలో 34,403 మంది కరోనా బారినపడినట్లు తేలింది. మొత్తంగా మహమ్మారి సోకిన వారి సంఖ్య 3.33 కోట్లకు చేరగా.. 3.25 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Team India: టీమ్‌ఇండియాభవిష్యత్తు కెప్టెన్‌ పేరు సూచించిన గావస్కర్

కేల్‌ రాహుల్‌లో నాయకత్వ లక్షణాలున్నాయని, భవిష్యత్తు కెప్టెన్‌గా అతణ్ని ప్రోత్సహించాలని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లి టీ20 సారథిగా వైదొలగిన నేపథ్యలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘బీసీసీఐ భవిష్యత్తుపై దృష్టిపెట్టడం మంచి విషయం. భారత్‌ ఓ కొత్త కెప్టెన్‌ను తయారు చేయాలనుకుంటే రాహుల్‌పై దృష్టి పెడితే మంచిది. ఐపీఎల్, 50 ఓవర్ల క్రికెట్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతణ్ని వైస్‌ కెప్టెన్‌ను చేయొచ్చు’’ అని గావస్కర్‌ అన్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Saidabad: సైదాబాద్‌ ఘటన.. నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్‌

నగరంలోని సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు మృతిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ దీన్ని దాఖలు చేశారు. రాజుది కస్టోడియల్‌ మృతిగా అనుమానం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై మధ్యాహ్నం ఒంటిగంటకు హైకోర్టు విచారణ చేపట్టనుంది. సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు రాజు గురువారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై మృతిచెందాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పట్టాలపై పండిన పాపం

10. Tollywood Drugs Case: తనీష్‌.. మీకు కెల్విన్‌తో పరిచయాలున్నాయా?

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ తుదిదశకు చేరుకుంటోంది. ఇప్పటికే పదిమంది సినీ సెలబ్రిటీలను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి.. కీలక సమాచారం రాబట్టారు. విచారణలో భాగంగా శుక్రవారం ఉదయం నటుడు తనీష్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని