Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 16/10/2021 13:02 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం.. హాజరవ్వని ప్రకాశ్‌రాజ్‌

హోరాహోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించి నూతన ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నటుడు మంచు విష్ణు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సమక్షంలో శనివారం ఉదయం ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో, ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

MAA Elections: వ్యక్తిగత లాభం కోసం మోహన్‌బాబు ఎప్పుడూ మాట్లాడలేదు: తలసాని

2. నేను తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు.. పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా: సోనియా

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు..తదితర అంశాలే అజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సమావేశం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. IPL 2021: చెన్నైని అందుకే కదా... ‘సూపర్‌ కింగ్స్‌’ అనేది!

పడటం తప్పు కాదు... ఆ తర్వాత బలంగా లేవకపోవడం తప్పు. ఈ పనిని సమర్థంగా చేసిన వారిని బయట హీరోలు అంటారు. అదే ఐపీఎల్‌ (IPL)లో అయితే ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ (Chennai Super Kings) అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఐపీఎల్‌ 2021 (IPL 2021)లో మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni) సేన ప్రదర్శన అలా ఉంది మరి. ఐపీఎల్ 2020 (IPL 2020)లో పాయింట్ల పట్టికలో ఆఖరు నుంచి రెండులో ఉండిపోయిన చెన్నై... ఈ ఏడాది ‘సూపర్‌’ ఆటతో  విజేతగా (IPL 2020 Winner) ఎలా నిలిచింది. ఈ ఏడాదిలో సీఎస్‌కే (CSK) ఏం చేసింది? ఓ లుక్కేద్దాం రండి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Ruturaj Gaikwad: ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌’ అని ఊరికే అన్నారా..? రుతురాజ్‌ అంటే ఇదే మరి!

4. ప‌న్ను రిఫండ్ రిజ‌క్ట్ కాకుండ‌దంటే.. ఈ ప‌ని పూర్తిచేయండి

ప‌న్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించాల్సిన ప‌న్ను కంటే అద‌న‌పు ప‌న్ను చెల్లించిన‌ట్ల‌యితే.. అదనంగా చెల్లించిన ప‌న్ను మొత్తాన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ రిఫండ్ చేస్తుంది. రిట‌ర్నులు ఫైల్ చేసిన త‌రువాత ఐటి శాఖ‌ వాటిని ప్రాసెస్ చేసి, వెరిఫై చేస్తుంది. ఈ ప్ర‌క్రియ పూర్తైన త‌రువాత‌.. మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్‌) అధికంగా చెల్లించ‌డం లేదా ఆదాయ‌పు ప‌న్ను త‌ప్పుగా లెక్కించ‌డం వ‌ల్ల  చెల్లించిన అద‌న‌పు ప‌న్నును వాప‌సు ఇస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. AP News: గుంటూరు జీజీహెచ్‌లో 4రోజుల పసికందు అదృశ్యం

గుంటూరు జీజీహెచ్‌లో నాలుగు రోజుల పసికందు అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సమయంలో నాలుగు రోజుల మగ శిశువు అదృశ్యమయ్యాడు. తాత, అమ్మమ్మ వద్ద పడుకొని ఉన్న చిన్నారి కనిపించకుండాపోయాడు. శిశువు అదృశ్యంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పసికందు అదృశ్యంపై వారు జీజీహెచ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు!

6. 6G Network: 5Gకి 50 రెట్ల వేగంతో 6G... ఎప్పుడొస్తుందంటే?

5G... ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా  ఈ మాటే వినిపిస్తోంది. మొబైల్‌ నెట్‌వర్క్‌లో దీనినో విప్లవంగా చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే 5G మొబైల్స్‌ మన దేశంలోకీ వస్తున్నాయి. అయితే దేశంలో 5G అందుబాటులోకి రాకపోయినా... 6G ముచ్చట్లు మొదలయ్యాయి. 6G ఫీచర్లు, స్పీడ్‌ ఇవీ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అవేంటో చదివేయండి! మన దేశంలో 5జీ సర్వీసులు వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి వస్తాయని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Rahul Dravid: టీమ్‌ఇండియా అభిమానులకు శుభవార్త.. ద్రవిడ్‌ అంగీకరించాడు!

టీమ్‌ఇండియా అభిమానులకు పెద్ద శుభవార్త అందింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండేందుకు ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించాడని తెలిసింది. గతరాత్రి దుబాయ్‌ వేదికగా చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జైషా.. ద్రవిడ్‌ని కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IPL 2021: దురదృష్టం కొద్దీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయాం: మోర్గాన్

8. India Corona: పండగ ఎఫెక్ట్.. మరోసారి తగ్గిన కరోనా కేసులు 

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా మరోసారి కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. క్రియాశీల కేసులు 217 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. శుక్రవారం దసరా పండగ రోజు కావడంతో 9,23,003 మంది మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 15,981 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. 17,861 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. V.K.Sasikala: జయలలిత స్మారకం వద్ద శశికళ నివాళులు.. భావోద్వేగంతో కంటతడి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ.. చెన్నైలోని మెరీనా బీచ్‌ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్‌ స్మారకాల వద్ద నివాళులు అర్పించారు. ఈ క్రమంలో జయ స్మారకం వద్ద శశికళ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. అంతకముందు ఆమె కారుపై అన్నాడీఎంకే జెండాతో స్మారకాల వద్దకు వెళ్లారు. జయ సమాధిని పుష్పాలతో అలంకరించిన కార్యకర్తలు శశికళకు అన్నాడీఎంకే జెండాలతో స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Jabardasth: టెన్షన్‌ పడుతూ బాలకృష్ణకు రోజా ఫోన్‌

‘బొబ్బిలి సింహం’, ‘భైరవద్వీపం’ చిత్రాలతో నందమూరి బాలకృష్ణ, రోజా జోడీ అప్పట్లో సూపర్‌హిట్స్‌ అందుకున్నారు. ఆ రెండు సినిమాలు విడుదలై సుమారు 28 సంవత్సరాలైనప్పటికీ ఈ జోడీకి క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానుల ఆశ. ఈ క్రమంలోనే తాజాగా రోజా.. బాలకృష్ణకు ఫోన్‌ చేసి మాట్లాడారు. వీరిద్దరి సరదా సంభాషణకు ‘జబర్దస్త్‌’ వేదికైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని