Top TenNews @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 23/10/2021 12:56 IST

Top TenNews @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1.ఈటల, రేవంత్‌ భేటీ వెనుక మతలబేంటి?: కేటీఆర్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సమీపిస్తోన్న నేపథ్యంలో తెరాస, భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటలపై మంత్రి కేటీఆర్‌ తాజాగా పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ నేతలతో ఆయన కుమ్మక్కయ్యారని విమర్శించారు.

2.భారీగా పెరిగిన మరణాలు.. అత్యంత కనిష్ఠానికి క్రియాశీల రేటు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 29 రోజులుగా కొత్త కేసులు 30 వేల మార్క్‌కు దిగువనే ఉంటున్నప్పటికీ.. కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13.64లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 16,326 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు నమోదైన కేసుల(15,786)తో పోలిస్తే 3.42శాతం ఎక్కువ. ఇదే సమయంలో మరణాలు భారీగా పెరగడం గమనార్హం.

3.కేటీఆర్, రాజాసింగ్‌ మధ్య ట్వీట్‌ వార్

మంత్రి కేటీఆర్‌, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం నడిచింది. పాతబస్తీలో పర్యటనకు కేటీఆర్‌ బైక్‌పై రావాలని రాజాసింగ్‌ ట్వీట్‌ చేశారు. పాతబస్తీని అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ అసెంబ్లీలో చెప్పారని రాజాసింగ్‌ అన్నారు. సర్కారు అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపిస్తాం అని తెలిపారు. కాగా ఈ ట్వీట్‌కు కేటీఆర్‌ బదులిచ్చారు. పెట్రోల్‌ ధరల పెంపుపై ప్రజలు ఏమంటున్నారో ఎందుకు తెలుసుకోవట్లేదు అని కౌంటర్‌ ఇచ్చారు.

4.విచారణపై పోలీసులు ట్వీట్లు చేయొచ్చా?

కేసుల విచారణ వివరాలను పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్న వైనంపై విధివిధానాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. క్రిమినల్‌ కేసుల విచారణ సమాచారాన్ని కొందరు పోలీసులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తుండడం ఇబ్బందికరంగా మారిందని, దీనిపై నిబంధనలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌దారు కోరారు.

5.రూ.50కి మించిన మొబైల్‌ రీఛార్జీలపై ఫోన్‌పే ప్రాసెసింగ్‌ రుసుము

వాల్‌మార్ట్‌ గ్రూప్‌నకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే, ఫోన్‌ రీఛార్జులపై ప్రాసెసింగ్‌ రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున వసూలు చేయనుంది. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్‌ రుసుము భారం పడుతుంది

స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఇలా మదుపు చేయండి!

6.ధోనీని మెంటార్‌గా ఎందుకు తీసుకున్నారు... అంత స్పెషలేంటి?

మాస్టర్‌ మైండ్‌... ఆధునిక క్రికెట్‌ అందులోనూ ఇండియన్‌ క్రికెట్‌లో ఈ పేరు సెట్‌ అయ్యే ఏకైక క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. టీమిండియా కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ధోనీ వేసిన ప్రణాళికలు, ఆచరణలో పెట్టిన విధానం, కుర్రాళ్లను నడిపిన తత్వం చూస్తే ఎవరన్నా ఈ మాటే అంటారు. మొన్నటి వరకు మహేంద్ర సింగ్‌ ధోనీ.. ఇప్పుడు టీమిండియాకు మెంటార్‌ ధోనీ అయ్యాడు.

7.అనన్య.. ఇదేం సినిమా షూటింగ్‌ కాదు లేటుగా రావడానికి!

బాలీవుడ్‌ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న క్రూయిజ్‌ నౌకపై డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో నటి అనన్య పాండే శుక్రవారం కూడా ఎన్‌సీబీ విచారణకు హాజరయ్యారు. అయితే అధికారులు ఇచ్చిన సమయం కంటే అనన్య మూడు గంటలు ఆలస్యంగా ఆఫీస్‌కు వచ్చారు. దీంతో ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్ సమీర్‌ వాంఖడే ఆమెను గట్టిగానే మందలించినట్లు దర్యాప్తు సంస్థ వర్గాల సమాచారం.

8.ఉత్తరాఖండ్‌లో విషాదం.. పర్వతారోహణకు వెళ్లి 12 మంది మృతి

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడి 12  మంది పర్వతారోహకులు దుర్మరణం చెందారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ మధ్య ఉండే హార్సిల్‌-చిట్కుల్‌ ట్రెక్‌ రూట్‌లో పర్వతారోహణకు వెళ్లిన 11 మంది బెంగాలీ ట్రెక్కర్లు మంచు చరియలు విరిగిపడి గల్లంతయ్యారు.

9.మేక పాలు లీటర్‌ రూ.400!

మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పుర్‌ జిల్లాలో ఇటీవల మేక పాలకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. దీంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ. 30 నుంచి 40 మధ్య లభించే లీటర్‌ పాలు ఇప్పుడు రూ.300 నుంచి 400కి చేరుకున్నాయి. ఈ స్థాయిలో ధరలు పెరగడం వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.. రాష్ట్రంలో డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అందులోనూ ఛత్తర్‌పుర్‌ సహా సమీప జిల్లాల్లో వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంది.

10. ఆరడుగుల ప్రభంజనం..ప్రభాస్‌

‘ఈశ్వర్‌’తో గల్లీకుర్రాడిగా తెలుగుతెరకు పరిచయమైన ప్రభాస్‌... ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలందుకొని పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. లవర్‌బాయ్‌గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా, మాస్‌ హీరోగా, అమరేంద్ర బాహుబలిగా ఇలా పలు పాత్రలతో వైవిధ్యాన్ని కనబరిచాడు. రూ.వందకోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తాని సగర్వంగా చాటిన యువ తరంగం ప్రభాస్‌.

రాధేశ్యామ్‌ టీజర్‌ వచ్చేసింది..!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని