Top Ten News @ 9 AM

తాజా వార్తలు

Updated : 29/05/2021 09:29 IST

Top Ten News @ 9 AM

1. EAMCET వాయిదా!

ఎంసెట్‌ వాయిదాపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం జులై 5 నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాలి. ఇంటర్‌ పరీక్షలను జులై 15 తర్వాత జరుపుతామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు లిఖితపూర్వకంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ పరీక్షలు పూర్తికాకుండా ఎంసెట్‌ నిర్వహించడం సమంజసం కాదనే నిర్ణయానికి ఉన్నత విద్యామండలి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నవజాత శిశువుకు కొవిడ్‌ ‘మల్టీసిస్టమ్‌’ సిండ్రోమ్‌

అత్యంత అరుదైన లక్షణాలతో జన్మించిన ఓ నవజాత శిశువు విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో వైద్యుల చికిత్సతో కోలుకుంటోంది. చర్మంపై రకరకాల రంగుల్లో మచ్చలు, జ్వరం, ఆయాసంతో వచ్చిన 7 రోజుల పాప ఈ నెల 21న ఆంధ్ర ఆసుపత్రిలో చేరింది. ఆ సమయంలో శిశువుకు అధిక జ్వరం, ఆయాసం, చర్మంపై నడుము, పిరుదులు, కాళ్లు, పాదాల వద్ద నీలం, ఎరుపు రంగుల్లో మచ్చలు చాలా పెద్దవిగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మెలిపెడుతూనే ఉంది

ఫోన్‌ మోగింది. నా కళ్లు మెరిశాయి. తనే! ‘మీ ఫ్రెండ్‌ రఘు అట. అర్జెంట్‌గా ఫోన్‌ చెయ్యాలట. నంబర్‌ రాసుకోండి’ అంది. రాసుకున్నాను. కొన్నాళ్ల కిందట. ఫోన్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతుంటే, ఎవడో బైక్‌ మీద దూసుకొచ్చి లాక్కెళ్లిపోయాడు. ఆర్నెల్ల కింద కొన్న ఖరీదైన మొబైల్‌ అది. బాధ పడుతూనే రెండు రోజులాగి ఇంకో ఫోన్‌ కొన్నా. పాత నెంబర్‌ కలిసి రాలేదని కొత్తది తీసుకున్నా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బాదుడే బాదుడు

కరోనా సోకి దిక్కుతోచక నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులను ప్రైవేటు ఆసుపత్రులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయి. కొన్ని  పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఓ మాదిరి సౌకర్యాలున్న దవాఖానాలో రోజుకు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. మందుల ఖర్చు దీనికి అదనం... నామమాత్రపు సౌకర్యాలతో ఉన్న ఓ చిన్న ఆసుపత్రి వసూలు చేసేది రోజుకు రూ.40-రూ.50 వేలు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఇది అయిదు నుంచి పది రెట్లు ఎక్కువ.  ఇలా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని 64 ఆసుపత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విమాన ఛార్జీలు 1 నుంచి పెరుగుతాయ్‌

దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13 - 16 శాతం పెంచుతూ పౌరవిమానయాన శాఖ శుక్రవారం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. ఎగువ పరిమితిలో మాత్రం మార్పు చేయలేదు కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ. 2,300 నుంచి రూ. 2,600లకు పెరుగుతుంది. 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం రూ. 2,900 ఉండగా అది రూ. 3,300కి పెరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రయాణికులు లేక 8 రైళ్ల రద్దు

6. కొవిడ్‌లో ప్రెగ్నెన్సీ... శిశువుకిప్రమాదమా?

నాకు ఈ మధ్యే కొవిడ్‌ వచ్చింది. ఇంట్లోనే ఉంటూ అయిదు రోజుల కోర్సు వాడాను. డోలో, డాక్సీ ఐవెర్‌మెసిటిన్‌, జింక్‌ కోల్డ్‌ మాత్రలు వేసుకున్నా. కోలుకునేసరికి నెలతప్పానని తెలిసింది. నేను వాడిన మందులు ఏమైనా ప్రతికూల ప్రభావం చూపుతాయా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు చివరిసారిగా నెలసరి వచ్చిన తేదీని (మొదటి రోజు) రాసి ఉంటే ఈ మందుల వాడకం వల్ల గర్భస్థ శిశువు మీద ప్రభావం ఉంటుందో లేదో చెప్పడం తేలికయ్యేది. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో కొన్ని రకాల మందులు శిశువు అవయవాల నిర్మాణం (ఆర్గానోజెనిసిస్‌) పై ప్రభావం చూపుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మళ్లీ వస్తా.. మల్లికనై పూస్తా!

హీరోలతో పోల్చితే నాయికల సినీ కెరీర్‌ పరిధి చాలా తక్కువ. అందుకే ఉన్న కొద్ది సమయంలోనే జెట్‌ స్పీడ్‌తో అన్ని భాషలు చుట్టొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అయితే పరభాషల్లో జోరు చూపించే క్రమంలోనో.. ఆచితూచి కథలు ఎంచుకునే ప్రయత్నాల్లోనో.. కొద్ది మంది నాయికలు అడపాదడపా తెలుగు చిత్రసీమ నుంచి గ్యాప్‌ తీసుకుంటుంటారు. అలాగని వాళ్లెప్పుడూ శాశ్వతంగా తెలుగు తెరకు దూరమవ్వాలనుకోరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అడుగేస్తే అందలం!

ప్రపంచ టెన్నిస్‌లో దిగ్గజం ఎవరంటే.. ఎక్కువ మంది చెప్పే పేరు రోజర్‌ ఫెదరర్‌. అద్వితీయమైన ఆటతో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్న ఈ స్విస్‌ వీరుడు అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో శిఖరాగ్రాన నిలిచి చరిత్ర సృష్టించాడు. అతని జోరు చూసి మరే ఆటగాడూ తనకు చేరువగా రాడని అంతా అనుకున్నారు. కానీ స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ దూసుకొచ్చాడు. దూకుడైన ఆటతో విజయాల వేట కొనసాగించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారం

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా గోపాలపూర్‌ అవుట్‌పోస్టులో చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ ఎస్పీ సుధాంశు శేఖర్‌ శుక్రవారం తెలిపిన వివరాల మేరకు... యస్‌ తుపాను నేపథ్యంలో ప్రజలకు సేవలందించేందుకు గోపాలపూర్‌ అవుట్‌పోస్టులో అదనపు సిబ్బందిని నియమించారు. ఇందులో బాధిత మహిళా కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. అక్కడ విధుల్లో ఉన్న ఆమెపై బుధవారం రాత్రి ఎస్‌ఐ బన్సీధర్‌ ప్రధాన్‌ అత్యాచారం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సెకండరీ ఇన్‌ఫెక్షన్లు సోకినవారిలో 56 శాతం మరణాలు!

కోవిడ్ చికిత్స తీసుకున్నాక బాక్టీరియా, ఫంగస్‌ తదితర సెకండరీ ఇన్‌ఫెక్షన్ల బారిన పడ్డ రోగుల్లో సగం మంది మృత్యువాత పడుతున్నారని  ఐసీఎంఆర్‌ చేసిన ఓ అధ్యయనంలో బయటపడింది. చికిత్సానంతరం కొవిడ్‌ రోగులు ఆస్ప్రతిలో సోకే వ్యాధులు, బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్నట్లు కనుగొన్నారు. 17, 534 మంది కొవిడ్ రోగులపై గతేడాది జూన్‌-ఆగస్టు మధ్య ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసింది. అందులో మొత్తం కొవిడ్‌ రోగుల్లో 3.6శాతం మంది తిరిగి బ్యాక్టీరియా లేదా ఫంగస్‌ వ్యాధుల బారిన పడుతున్నారని తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని