Top Ten News @ 9 AM

తాజా వార్తలు

Updated : 10/06/2021 09:06 IST

Top Ten News @ 9 AM

1. రాజధాని రైతుల అప్పులు... తిప్పలు

రాజధాని అమరావతి పరిధిలోని చాలా గ్రామాల్లో రైతులు కొవిడ్‌ మహమ్మారితో  అష్టకష్టాలు పడుతున్నారు. చేతిలో పొలం లేక ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు కొనేవారులేక వైద్యఖర్చులకు సతమతమవుతున్నారు.  రాజధాని గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు కరోనా బారిన పడిన కుటుంబాలూ ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారికి రూ.లక్షల్లో ఖర్చయింది. వారి భూమి ఏళ్ల కిందటే ప్రభుత్వానికి ఇచ్చేశారు. వ్యవసాయం లేదు. ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్లు అభివృద్ధి చేయలేదు. వాటిని అమ్ముదామన్నా కొనేవారు లేరు. ఈ పరిస్థితుల్లో చాలా మంది తెలిసినవాళ్లు, బంధువుల వద్ద అప్పు చేశారు. కొందరు ఇంట్లో ఉన్న నగానట్రా కుదువబెట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. ఘంటసాల కుమారుడు కన్నుమూత

 సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. రత్నకుమార్‌ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంలో విషాదం నెలకొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. Balakrishna: బాక్సాఫీస్‌ బంగారు కొండ 

కంటి చూపుతో బాక్సాఫీసు చరిత్రలు తిరగరాయగలడు. నైజం, సీడెడ్‌, ఆంధ్ర ఇలా ఏ సెంటరైనా ఆయన దిగనంతవరకే, వన్స్‌ హి స్టెప్‌ ఇన్‌ హిస్టరీ రిపీట్స్‌. ఈ చరిత్రను ఆయన సినిమా రికార్డులే చెబుతాయి. సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం ఇలా అన్ని రకాల చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌ నటరత్నంలా వెలిగిపోతున్నారు. ఓ క్రమంలో వరుసగా పరాజయాలు పలకరించినా, వెనక్కి తగ్గకుండా సింహంలా ముందుకు దూకారు.  బాక్సాఫీస్‌ పేలిపోయేలా మళ్లీ కలెక్షన్ల వర్షం కురిపించారు.  తండ్రికి తగ్గ తనయుడుగా  4 దశాబ్దాలుగా నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు నేడు(గురువారం). ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ముంబయిలో ఘోర ప్రమాదం: 11 మంది మృతి

ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. మల్వానిలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఆటో ప్రయాణం... తగ్గేను... ప్రమాదం!

ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణిస్తున్నారా? సహచర ప్రయాణికుల్లో ఒక కొవిడ్‌ బాధితుడు ఉంటే వారి నుంచి వైరస్‌ వ్యాపించే ముప్పు ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఆటో, బస్సు, నాన్‌ ఏసీ కారు, ఏసీ కారు... ఈ నాలుగింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు... మిగతా వాటి కంటే ఆటో ప్రయాణంలోనే వైరస్‌ వ్యాప్తి ముప్పు తక్కువ ఉంటుందని అమెరికాలోని జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన బ్లూమ్‌ బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు తేల్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. జులైలో ఇంటర్‌, డిగ్రీ పరీక్షలు?

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే నెలలో ఇంటర్‌, ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాలి. ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని భావిస్తున్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఉస్మానియా.. చోటు దక్కిందయా!

ప్రతిష్ఠాత్మక క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చోటు దక్కింది. ఏళ్ల తరబడి నిరీక్షణ తర్వాత స్థానం దక్కించుకుని ప్రపంచ విశ్వవిద్యాలయాల సరసన నిలిచింది. 2022 సంవత్సరానికి క్యూఎస్‌ సంస్థ ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు కేటాయించింది. ఇందులో తొలిసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు దక్కించుకుంది. ప్రభుత్వ విభాగంలో మధ్యతరహా విశ్వవిద్యాలయంగా గుర్తించి ర్యాంకును ప్రకటించింది. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ఆచార్యుల మధ్య నిష్పత్తి 20గా ఉన్నట్లు క్యూఎస్‌ ప్రకటించింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. సూర్య గ్రహణం‌ నేడు .. మనకు ప్రభావం ఉంటుందా?

ఈ నెల 10న వైశాఖ మాసం అమావాస్య రోహిణి నక్షత్రంలో వలయాకార  సూర్య గ్రహణం ఏర్పడుతుందని, ఇది ఆకాశంలో జరిగే ఓ గొప్ప అద్భుతమని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ రోజు సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్య కిరణాలు చంద్రుడిపై పడి చంద్రుడి నీడ భూమిపై పడటంతో  ఈ గ్రహణం ఏర్పడుతుందన్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం భారతదేశంలో ఉండదని తెలిపారు.  చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా రావడం వల్ల అది ఓ రింగ్‌లా ఏర్పడటంతో దీన్ని పాశ్యాత్యులు రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అని పిలుస్తున్నారని  పేర్కొన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. తప్పనిసరైతేనే నగదు ముద్రణ

‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నగదు ముద్రించి నేరుగా ప్రభుత్వానికి రుణాల కింద  ఇచ్చే వీలుంది. అసలే ప్రత్యామ్నాయమూ లేదని అనుకుంటే మినహా, ప్రస్తుత పరిస్థితుల్లో అలా చేయకపోవడమే మంచిద’ని ఆర్‌బీఐ మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ప్రభుత్వం  నిధుల లోటును భర్తీ చేసుకునేందుకు పరిమిత వడ్డీ రేట్లపై రుణాలు సమీకరించే స్థితిలో లేనప్పుడు మాత్రమే ఆ మార్గం అనివార్యం అవుతుందని.. ప్రస్తుతం భారత్‌కు అలాంటి పరిస్థితి లేదనే అనుకుంటున్నానని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. French Open: ఛాంపియన్‌ ఇంటికి

గ్రీస్‌ భామ మారియా సకారి మాయ చేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ స్వెటెక్‌కు షాకిచ్చి.. సెమీస్‌లో అడుగుపెట్టింది. ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఆ ఘనత సాధించిన తొలి గ్రీకు అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. మరోవైపు అమెరికా టీనేజీ సంచలనం గాఫ్‌ జోరుకు క్వార్టర్స్‌లో కళ్లెం వేసిన క్రెజికోవా మొదటిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నాదల్‌ దూకుడు కొనసాగుతోంది. అతను తుది నాలుగులో చేరాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ మెద్వెదెవ్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని