close

తాజా వార్తలు

Published : 14/04/2021 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. CBSE పరీక్షలు: ‘10’ రద్దు.. ‘12’ వాయిదా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. త్వరలో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు: కేటీఆర్‌

దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందిని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో మంత్రి పలు అభివృద్ధిపనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ రాకముందు, నేటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
3. ఏపీలో 4,157 కేసులు.. 18 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,732 పరీక్షలు నిర్వహించగా.. 4,157 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,37,049 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల నెల్లూరులో నలుగురు చనిపోగా.. చిత్తూరు, కృష్ణాలో ముగ్గురేసి, విశాఖలో ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!

4. సచిన్ వాజే కేసులో కొత్త ట్విస్ట్‌..!

ముకేశ్‌ అంబానీకి బెదిరింపుల కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే కుట్ర ఒకటి కొత్తగా వెలుగులోకి వచ్చింది. మరో ఇద్దరిని హతమార్చేందుకు ఆయన కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా పేరున్న సచిన్‌ వాజే ఇద్దర్ని చంపి ‘ఎన్‌కౌంటర్‌’గా చిత్రీకరించేందుకు వ్యూహం పన్నినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. అయితే, ఈ ప్రణాళిక అమలు కాకపోవడంతో ప్లాన్‌-బి అమలు చేసినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెండోస్థానం కోసం తెదేపా పోటీ: కన్నబాబు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమ కుటుంబానికి సంబంధం లేదంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసే ప్రమాణాలకు అర్థం లేదని మంత్రి కన్నబాబు అన్నారు. ఆ హత్య కేసును సీఎం జగన్‌.. సీబీఐకి అప్పగించిన విషయం తెలియదా? సీబీఐ దర్యాప్తు చేపట్టినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా? అని లోకేశ్‌ను మంత్రి ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పవన్‌ గురించి మాట్లాడితే తిడతారు: రేణూ దేశాయ్‌

ఒకవేళ తను పవన్‌కల్యాణ్‌ గురించి ఏదైనా మాట్లాడితే కొంతమంది దాన్ని నెగటివ్‌గా తీసుకుని కామెంట్లు చేస్తున్నారని నటి రేణూ దేశాయ్‌ తెలిపారు. తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఆద్యతో కలిసి కొంతసేపు ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చారు. ఇందులో భాగంగా నెటిజన్లకు కొన్ని సూచనలు చేశారు. కరోనా సెకండ్‌వేవ్‌ ఉద్ధృతంగా ఉన్నందున అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు. అత్యవసరమైతేనే జన సమూహాల్లోకి వెళ్లాలని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కలర్‌ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా

7. భారత్‌లోకి సరికొత్త హైబ్రీడ్‌ ట్రాక్టర్‌

 సోలీస్‌ యాన్మార్‌ రేంజస్‌ పరిధిలోని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ (ఐటీఎల్‌) భారత్‌లో సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. సోలీస్‌ హైబ్రీడ్‌5015 పేరుతో ట్రాక్టర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.7.21లక్షలుగా నిర్ణయించింది. దీంతో భారత్‌కు ఈ పవర్‌ బూస్ట్‌ టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఐటీఎల్‌కు దక్కింది. ఈ టెక్నాలజీకి సంబంధించిన పలు పేటెంట్లు సంస్థ పేరిట ఉన్నాయి. భారత్‌లో 4వీల్‌ డ్రైవ్‌లో సోలీస్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైబ్రీడ్‌ 5015 ట్రాక్టర్‌ ఉపయోగపడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భాగ్‌ మానవా భాగ్‌..!

వ్యాయామం అలావాటు లేని వారు కొవిడ్‌ బారిన పడితే తీవ్రమైన లక్షణాలు సంక్రమించే ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌డియాగో  50 వేల మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు ‘బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌’ నివేదికలో పేర్కొంది. వృద్దులు, అవయవ మార్పిడి జరిగిన వారి తర్వాత అత్యధికంగా కొవిడ్‌ దుష్ప్రభావాలను చవిచూస్తోంది శారీరక శ్రమలేని వారే అని తేలింది. అంతేకాదు పొగతాగే అలవాటు, ఊబకాయం, హైపర్‌ టెన్షన్‌ వంటివి ఉన్నవారి కన్నా.. వీరే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రాబోయే లాక్‌డౌన్ల వ‌ల్ల న‌ష్ట‌మెంత‌?

9. ఆండ్రాయిడ్‌ 12:  అబ్బో ఎన్ని కొత్త ఫీచర్లో!

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు కొత్త ఆప్షన్లు, ఫీచర్లు జోడిస్తూ ఏటా కొత్త వెర్షన్‌ను రిలీజ్‌ చేస్తుంటుంది గూగుల్‌. అలా ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 12 వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి డెవలపర్ల కోసం ఇప్పటికే రెండు బీటా వెర్షన్లు విడుదల చేశారు. తాజాగా మూడోది బయటకు వచ్చింది. వాటి ఆధారంగా ఆండ్రాయిడ్‌ 12 ఇలా ఉండొచ్చు అంటూ కొన్ని ఫీచర్లు అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అవేంటో చూసేద్దాం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కేకేఆర్‌ ఓటమి సిగ్గుచేటు: వీరూ ఫైర్‌

ముంబయి మ్యాచ్లో‌ ఘోర పరాజయం పాలైన కోల్‌కతాపై టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ఎదురుదాడి చేయకుండా ఆఖరి వరకు ఆటను కొనసాగించడం ఏంటని ప్రశ్నించాడు. దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌లో గెలిపించాలన్న తపన కనిపించలేదన్నాడు. ఈ ఓటమి కేకేఆర్‌కు సిగ్గుచేటని ఘాటుగా విమర్శించాడు. రోహిత్‌ సేన నిర్దేశించిన లక్ష్య ఛేదనలో 8.4 ఓవర్లకు 72/0తో ఉన్న మోర్గాన్‌ బృందం 10 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

షారుఖ్‌ క్షమాపణ: ఇదే ముగింపు కాదన్న రసెల్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని