Top 10 News @ 5 PM

తాజా వార్తలు

Updated : 26/04/2021 17:21 IST

Top 10 News @ 5 PM

1. Corona: పలు రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

 కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు లేకపోవడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 28- మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు నరసాపురం ఎక్స్‌ప్రస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా అదే తేదీల్లో సికింద్రాబాద్‌-బీదర్, బీదర్‌ -హైదరాబాద్‌ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Corona Effect: జర్నలిస్టులకు ఆర్థిక సాయం

కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం ప్రకటించింది.తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ వెల్లడించారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబసభ్యులు మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా కరోనా బారిన పడిన జర్నలిస్టులకూ ఆర్థిక సాయం చేస్తున్నట్లు నారాయణ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నోటీసులు

3. ‘కరోనా వేళ పరీక్షలా?..జోక్యం చేసుకోండి’

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో నెలకొన్న విషమ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు. పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారనుందని లేఖలో వివరించారు. ఇంటర్‌, పది పరీక్షలకు సుమారు 16.3లక్షల మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Karnataka:14రోజుల కఠిన కర్ఫ్యూ.. రవాణా బంద్‌!

దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తున్న వేళ దేశం మరోసారి కఠిన ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్‌ అమలు పరుస్తుండగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం 14 రోజుల కఠిన కర్ఫ్యూ ప్రకటించింది. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ, బెంగళూరులో వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధించినప్పటికీ వైరస్‌ కట్టడి కాకపోవడంతో మంగళవారం రాత్రి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్టు సీఎం యడియూరప్ప వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రకటనలు

5. Molnupiravir: కొవిడ్‌ చికిత్స అనుమతివ్వండి!

కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. చికిత్సలో వినియోగించే ఔషధాలపై ఫార్మా సంస్థలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా నాట్కో ఫార్మా తయారుచేసిన ‘మోల్నుపిరావిర్‌’ ఔషధం మూడోదశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు చేసుకున్నట్లు నాట్కో ఫార్మా సంస్థ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Oxygen: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడిలో (thoothukudi) వేదాంతకు చెందిన స్టెరిలైట్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. కాలుష్యం వెదజల్లుతోందన్న కారణంతో 2018లో దీన్ని మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆక్సిజన్​ ఉత్పత్తి కోసం మాత్రమే sterilite ప్లాంట్‌ను తెరవాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మీ విధానాలతో భారత్‌ను బాధితురాలిగా మార్చొద్దు

7. భయం వద్దు: 90శాతం రోగులకు ఇంటివద్దే నయం!

 దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో కరోనా వైరస్‌ మహమ్మారికి భయపడొద్దని.. అది కేవలం స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ మాత్రమేనని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. వైరస్‌ సోకిన వారిలో 85 నుంచి 90శాతం రోగులు లక్షణాలకు అనుగుణంగా ఇంటివద్దే చికిత్స తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. #Maldives బంద్‌.. సినీ తారలపై ట్రోల్స్‌

కాస్త విరామం దొరికితే చాలు సినిమా తారలు వెంటనే మాల్దీవుల బాట పడుతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌ తారల వల్ల మాల్దీవులు మరో ముంబయిలా మారింది. చాలామంది బర్త్‌డే, మ్యారేజ్‌డే.. ఇలా విశేషమేదైనా మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హీరోయిన్లతే అక్కడ హాట్‌హాట్‌ ఫొటోషూట్‌లు చేసి.. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని మురిసిపోతుంటారు. అయితే.. అలాంటి వారందరికీ ఇది నిజంగా చేదువార్త. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Karthi Sulthan: ఓటీటీలో వచ్చేది ఆ రోజే

9. IPL: అయినా కొనసాగుతుంది: బీసీసీఐ

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ లీగ్‌ నుంచి ఇండియన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వైదొలిగాడు. అంతేకాదు, ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం లీగ్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితిపై బీసీసీఐ స్పందించింది. లీగ్‌ నుంచి నిష్క్రమణలు ఉన్నా, ఐపీఎల్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కరోనా అనిశ్చితిలోనూ లాభాల కళ కళ!

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ఉదయం 48,197 వద్ద బలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ 48,667 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని.. 48,152 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 508 పాయింట్ల లాభంతో 48,386 వద్ద ముగిసింది. నిఫ్టీ విషయానికి వస్తే 14,449 వద్ద సానుకూలంగా ప్రారంభమై 14,557 - 14,421 మధ్య కదలాడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Madras HighCourt: ఈసీపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని