Top 10 News @ 5 PM

తాజా వార్తలు

Updated : 30/04/2021 17:39 IST

Top 10 News @ 5 PM

1. CoronaVaccine: ధరల్లో తేడా ఎందుకు?

దేశంలో కరోనా సంక్షోభం.. నిర్వహణ అంశంపై దాఖలైన సుమోటో కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఒకింత అసహనం వ్యక్తం  చేసిన న్యాయస్థానం.. కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండేసి టీకా ధరలు ఎందుకు అని ప్రశ్నించిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. అసలు 100శాతం వ్యాక్సిన్లను కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయట్లేదని అడిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Night Curfew: తెలంగాణలో పొడిగింపు

తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది  శనివారం ఉదయం 5 గంటలకు ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

VACCINE: ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ నిలిపివేత

3. Covid 3rd wave: మహారాష్ట్రలో జులై-ఆగస్టులో..

కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో మహారాష్ట్ర థర్డ్‌వేవ్‌ ప్రభావాన్ని చవిచూడవచ్చని ఆరాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే సెకండ్‌వేవ్‌ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ నిత్యం 60వేల పాజిటివ్‌ కేసులు, దాదాపు 800 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. AP Exams : పునరాలోచించండి..

కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. పరీక్షలు రద్దు చేయాలని పలువురు కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పరీక్షల అంశంపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది. పరీక్షలంటే.. 30 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములవుతారని.. కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారు? అని కోర్టు ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘నియంతలా వ్యవహరించడం జగన్‌కు తగదు’

5. హత్యను దాచబోయి.. కార్చిచ్చుకు కారణమై..

గతేడాది ఆగస్టులో అమెరికాలో కాలిఫోర్నియా భారీ కార్చిచ్చు సంభవించిన విషయం తెలిసిందే. ఆ అగ్నికీలల్లో వందలాది భవంతులు కాలి బూడిదయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ఆ ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేసే క్రమంలో వెలుగుచూసిన నిజాలతో పోలీసులు షాకయ్యారు. ఓ మనిషిని చంపేసి, ఆ హత్యను దాచిపెట్టే ప్రయత్నం.. కార్చిచ్చుకు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టీకా కోసం..2రోజుల్లో 2.4కోట్ల మంది రిజిస్ట్రేషన్‌

మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దశలో 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ టీకా ఇస్తామని పేర్కొంది. ఇందుకోసం ఈ నెల 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే 2.4కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు 

7. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయమే బలహీనంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సెన్సెక్స్‌ ఒక దశలో 1000 పాయింట్లకు పైగా పతనమైంది. ఉదయం 49,360 వద్ద నష్టాలతో ప్రారంభమైన సూచీ చివరకు 983 పాయింట్లు కోల్పోయి 48,782 వద్ద ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కుంభమేళాకు 91 లక్షల మంది హాజరు!

హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు 91 లక్షల మంది భక్తులు హాజరైనట్లు కార్యక్రమ నిర్వహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 మధ్య వీరంతా పవిత్ర స్నానమాచరించినట్లు తెలిపారు. అత్యధికంగా ఏప్రిల్‌లో 60 లక్షల మంది హరిద్వార్‌లోని ఘాట్లకు చేరుకున్నారని కుంభమేళా ఫోర్స్‌ వెల్లడించింది. ఇక ఏప్రిల్‌ 12న ఒకేరోజు 35 లక్షల మంది కుంభమేళాకు హాజరైనట్లు పేర్కొన్నారు. ఇక మార్చి 11న జరిగిన మహాశివరాత్రి రోజు 32 లక్షల మంది భక్తులు పుణ్యస్నానమాచరించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona Vaccine కోసం రావొద్దు: కేజ్రీవాల్‌

9. SonuSood: కన్నీళ్లు పెట్టుకున్న రియల్‌హీరో

గతేడాది లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటివరకూ ఎంతోమందికి అపన్నహస్తం అందించి రియల్‌ హీరోగా సమాజానికి స్ఫూర్తినిచ్చారు నటుడు సోనూసూద్‌. పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. కాగా, తాజాగా ఆయన ప్రముఖ డ్యాన్స్‌ రియాల్టీ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా సోనూసూద్‌ చేస్తోన్న సేవలను కొనియాడుతూ డ్యాన్స్‌షోలోని కంటిస్టెంట్స్‌ ఓ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జోరుమీద బెంగళూరు.. పంజాబ్‌ పడగొట్టేనా?

ఈ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అదే ఉత్సాహంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో తలపడబోతోంది. అహ్మదాబాద్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. మరి కోహ్లీ సేన దూకుడుకు రాహుల్‌ కళ్లెం వేస్తాడా? పంజాబ్‌కు మూడో విజయం దక్కుతుందా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IPL: ‘నా స్కోరు కంటే జట్టు విజయమే ముఖ్యం’ 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని