Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 17:02 IST

Top Ten News @ 5 PM

1. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన జగన్‌
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని ఏపీ సీఎం జగన్‌ వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ను సీఎం విడుదల చేశారు. మార్చి 2022 వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు, సిఫార్సులు, పైరవీలకు తావు లేకుండా కేవలం మెరిట్‌ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని చెప్పారు. ‘‘ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్లు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్‌ తీసుకొస్తున్నాం. రెండేళ్లలో ఏకంగా 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశాం.’’

అశోక్‌గజపతిరాజు జైలుకెళ్లే పరిస్థితి: విజయసాయి
సీఎస్‌ పదవీకాలం పొడిగించొద్దు: కనకమేడల

2. Ts News: 24 గంటల్లో 1,82,523 మందికి టీకా
తెలంగాణలో గడచిన 24గంటల్లో 1,82,523 మందికి కొవిడ్ టీకాలు అందించినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. టీకా తీసుకున్న వారిలో 4,42,813 మంది హెల్త్ కేర్ వర్కర్లు, 3,65,505 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 18-44 ఏళ్ల మధ్య వారు 22,44,715 మంది ఉండగా.. 45 ఏళ్లు పైబడిన వారు 56,39,228 మంది ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 881 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపింది.

3. పోస్టాఫీసుల్లోనూ రైతు బంధు తీసుకోవచ్చు!
తెలంగాణలోని పోస్టాఫీసుల్లోనూ రైతుబంధు డబ్బులు తీసుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు తపాల శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ వెల్లడించారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా రైతుబంధు సొమ్ము తీసుకోవచ్చన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,794 తపాలా కార్యాలయాల్లో మైక్రో ఏటీఎంలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న ఏ బ్యాంకు ఖాతా కలిగి ఉన్నా మైక్రో ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవచ్చన్నారు. రైతులు ఆధార్ కార్డుతో పాటు ఆధార్‌తో లింక్ అయి ఉన్న చరవాణి తీసుకెళ్తే సరిపోతుందని పేర్కొన్నారు. 

4. Modi: వైరస్ ముప్పు తొలగిపోలేదు..సిద్ధంగా ఉందాం
కరోనా మహ్మమారి వేగంగా మార్పులు చేసుకొని కొత్త సవాళ్లను విసురుతోందని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వైరస్‌ కట్టడికి వేగంగా సిద్ధమవ్వాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. దానిలో భాగంగా కొవిడ్‌-19 ఫ్రంట్‌లైన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే నిమిత్తం కస్టమైజ్‌డ్‌ క్రాష్ కోర్సును ప్రారంభించారు.‘కొవిడ్‌-19 ముప్పు ఇంకా పొంచి ఉంది. వైరస్ ఉత్పరివర్తనం చెందడానికి చాలా అవకాశం ఉంది. వైరస్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి వేగంగా సిద్ధం కావాలి.

Trump: కరోనాతో భారత్‌ సర్వనాశనమైంది
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి ఈ అంశంపై మాట్లాడారు. కరోనాతో భారత్‌ సర్వనాశనమైందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌తో తీవ్రంగా నష్టపోయిన అమెరికాకు చైనా 10 ట్రిలియన్‌ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. వాస్తవానికి చైనా ప్రపంచానికి ఇంకా ఎక్కువగానే రుణ పడివుందనీ, కానీ వారికి ఇంతకంటే మించి చెల్లించే సామర్థ్యం లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు.
6. 
Delhi: ఈ తీరుతో త్వరలోనే ‘మూడో’ ముప్పు..!
దేశ రాజధాని నగరంలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీరు మూడో దఫా కరోనా వైరస్ విజృంభణను వేగవంతం చేస్తుందని హెచ్చరించింది. నగరంలో మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం దశలవారీగా సడలింపులు ప్రకటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లలో నిబంధనల ఉల్లంఘనలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.

7. Stock market: 650 పాయింట్లు కోలుకున్న సెన్సెక్స్‌
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ సెన్సెక్స్‌ శుక్రవారం ఇంట్రాడే కనిష్ఠాల నుంచి ఏకంగా 650 పాయింట్లు కోలుకుంది. అయినప్పటికీ సూచీలు లాభాలను మాత్రం ఒడిసిపట్టలేకపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఆసియా మార్కెట్లలో అప్రమత్తత కీలక రంగాల్లో అమ్మకాలకు కారణమయ్యాయి. దీంతో ఉదయం కాస్త సానుకూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపట్లోనే నష్టాల్లోకి జారుకుని ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి. తిరిగి క్రమంగా పుంజుకుని కనిష్ఠాల నుంచి పైకి ఎగబాకాయి.ఉదయం 52,568 వద్ద సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 51,601 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 21 పాయింట్లు లాభపడి 52,344 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే.. రోజులో 15,761- 15,450 మధ్య కదలాడిన సూచీ చివరకు 8 పాయింట్ల నష్టంతో 15,683 వద్ద స్థిరపడింది. 
8. స్విస్‌ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల సంపద
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద మరోసారి భారీగా పెరిగినట్లు ఆ దేశ జాతీయ బ్యాంకు ఎస్‌ఎన్‌బీ పేర్కొంది. దాదాపు 20 వేల 700 కోట్ల రూపాయలు స్విట్జర్లాండ్‌ల్లోని బ్యాంకుల్లో దాచుకున్నట్లు వెల్లడించింది. 2019లో 6 వేల625 కోట్ల రూపాయలుగా ఉన్న భారతీయుల సంపద ఆమాంతం పెరిగినట్లు వివరించింది. 2011 తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పెరగటం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది.

9. WTC Final: తొలిరోజు తొలి సెషన్‌ ఆట రద్దు

అనుకున్నదే జరిగింది! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకులు మొదలుపెట్టాడు. మ్యాచ్‌ జరిగే సౌథాంప్టన్‌లో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతో పిచ్‌ను, మైదానంలో కొంత భాగాన్ని కవర్లతో కప్పారు. మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు అంపైర్లు మైదానంలోకి వెళ్లి పరీక్షించారు. జల్లులు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. భారత్‌, న్యూజిలాండ్‌ పోరుకు అరగంటలో టాస్‌ పడుతుందనగా బీసీసీఐ అక్కడి వాతావరణ పరిస్థితులపై అప్‌డేట్‌ ఇచ్చింది. దురదృష్టవశాత్తు తొలిరోజు తొలి సెషన్‌ ఆట ఉండదని ప్రకటించింది.

WTC Final: థాంక్యూ ఐసీసీ

10. Putin: పుతిన్‌కు బైడెన్‌ గిఫ్ట్‌.. ఏమిటో తెలుసా..?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జెనీవా భేటీ సందర్భంగా ఒక గిఫ్ట్‌ ఇచ్చారు. అమెరికా సైన్యం వినియోగించే కాంకర్డ్‌ స్టైల్‌ ఏవియేటర్‌ సన్‌గ్లాసెస్‌ జతను బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది.  వీటిని మాస్సాచుసెట్స్‌ కేంద్రంగా పనిచేసే రాండోల్ఫ్‌ యూఎస్‌ఏ అనే కంపెనీ తయారు చేస్తుంది. అమెరికా వీటిని సైన్యంలో వాడటంతోపాటు నాటో భాగస్వాములకు కూడా అందజేస్తుంది. బైడెన్‌ స్వయంగా కళ్లజోళ్లను వినియోగిస్తున్నారు. ఆయన తరచూ వీటిని ధరించి కనిపిస్తారు. గతంలో టాప్‌గన్‌ చిత్రంలో టామ్‌ క్రూజ్‌ ధరించడంతో ఈ సన్‌గ్లాసెస్‌కు బాగా పేరొచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని