Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 24/06/2021 16:55 IST

Top Ten News @ 5 PM

1. Ts News: 97 లక్షల మందికి టీకా

తెలంగాణలో ఇప్పటివరకు 97 లక్షల మంది ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకున్నారని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ వెల్లడించారు. వారిలో 83 లక్షల మంది మొదటి డోసు వేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.2 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 100 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Ap News: 4,981 కేసులు.. 38 మరణాలు

2. Ts New: మరియమ్మ మృతిపై హైకోర్టు విచారణ

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు ఠాణాలో మహిళ మృతిపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ మృతిపై విచారణ జరపాలని ఆలేరు మెజిస్ట్రేట్‌ను ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం.. నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని స్పష్టం చేసింది. అవసరమైతే రీపోస్టుమార్టం జరపాలని తెలిపింది. పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.

AP news: ఎన్నారై ఆస్పత్రి వ్యవహారంపై హౌస్‌మోషన్‌

3. 35వేల తరగతి గదులు సిద్ధం చేశారా?: లోకేశ్‌

కనీస ఏర్పాట్లు, విద్యార్థుల ప్రాణాలకు రక్షణ చర్యలు చేపట్టకుండా మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏముందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో స్పష్టమైందన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సమగ్ర వివరాలు, ప్రణాళికలేని అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించారని ధ్వజమెత్తారు.

4. JK: ప్రధాని నివాసంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

జమ్మూకశ్మీర్‌కు చెందిన నేతలతో దిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. నేషనల్ కాన్ఫరెన్స్‌, పీపుల్స్ కాన్ఫరెన్స్, పీడీపీతో సహా 8 పార్టీలు ఈ సమావేశంలో భాగమయ్యాయి. సమావేశంలో పాల్గొనేందుకు గులాంనబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, యూసుఫ్ తరిగామి .. తదితర కీలక నేతలు ఇదివరకే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్‌ షా కూడా పాల్గొంటున్నారు.

5. Reliance AGM: Sep 10 నుంచి జియో ఫోన్‌ నెక్స్ట్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయాన్‌ రిలయన్స్‌ బోర్డులోకి వస్తున్నారు. ఈ మేరకు రిలయన్స్‌ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఫైనాన్స్‌, టెక్నాలజీలో యాసిర్‌ అల్‌ రుమయాన్‌ ప్రముఖ వ్యక్తి. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌గా ఆయన అనుభవం నుంచి ప్రయోజనం పొందుతామనే విశ్వాసం మాకుంది.

Jio Phone Next ఫీచర్లు ఇవే..

6. యూపీలో కేసు.. ముందస్తు బెయిల్‌కు ట్విటర్‌ ఎండీ

నూతన ఐటీ నిబంధనలను పాటించనందుకు గానూ భారత్‌లో మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయిన సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌.. తొలి విచారణ ఎదుర్కోబోతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ దాడి ఘటనకు సంబంధించిన కేసులో ట్విటర్‌ అధికారులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ నిమిత్తం ట్విటర్‌ ఇండియా హెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహేశ్వరీ నేడు పోలీసుల ఎదుట హాజరుకానున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే, ఇదే సమయంలో మనీశ్.. ముందస్తు బెయిల్‌ కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. 

7. Long Covid: 20 లక్షల మందికి దీర్ఘకాలిక కొవిడ్‌!

బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ అధ్వర్యంలో నిర్వహించిన రియాక్ట్‌ (రియల్‌ టైమ్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో మూడో వంతు మందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు దాదాపు 12 వారాల పాటు ఉన్నట్లు తేలింది. దాదాపు 5 లక్షల మందిని సర్వే చేయగా.. లభించిన సమాచారాన్ని బట్టి ఇంగ్లాండ్‌లో కనీసం 20 లక్షల మంది దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు అంచనాకు వచ్చారు.

8. Vaccine: 2 ఏళ్ల చిన్నారులకు టీకా ఎప్పుడంటే..?

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో టీకాలను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం 18ఏళ్ల వయసుపైబడిన వారికి మాత్రమే టీకా అందిస్తున్నారు. అయితే, రెండేళ్ల వయసు పైబడిన పిల్లలకు టీకా ఎప్పుడొస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌లో సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్యకాలంలో చిన్నారులకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ఎయిమ్స్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

9. Stock market: ఐటీ షేర్ల అండ.. మార్కెట్ల దూకుడు

దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు కూడా రాణించడంతో సెన్సెక్స్‌ 392.92 పాయింట్లు లాభపడి 52,699 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 103..50 పాయింట్లు లాభపడి 15,790.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.18గా ఉంది.

10. MAA Election: ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ ఇదే

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల రూపంలో తెలుగు సినీ పరిశ్రమలో మరో రసవత్తర పోరు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు నటుడు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్‌, హేమ ప్రకటించారు. దీంతో ‘మా’లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో ఈ జాబితాను విడుదల చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని