Top Ten News @ 5 PM

తాజా వార్తలు

Published : 13/07/2021 16:55 IST

Top Ten News @ 5 PM

1. వైఎస్‌ఆర్‌ జలకళ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు: జగన్‌

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్షించారు. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు, అర్బన్‌ ప్రాంతాలకు సమీపంలోని పల్లెల్లో 1,034 ఆటోలు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. వైఎస్‌ఆర్‌ జలకళ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైందని.. ఈ ప్రాజెక్టు సమర్థంగా ముందుకు సాగాలన్నారు. బిడ్జిల వద్ద చెక్‌డ్యామ్‌ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

పెన్నా కేసు నుంచి తొలగించండి: జగన్‌
Mansas trust: ప్రభుత్వ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

2. Ts News: కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు

తెలంగాణలోని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు. ఈనెల 19 నుంచి న్యాయస్థానాల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. 

3. అన్నీ గుర్తు పెట్టుకుంటాం: చంద్రబాబు
తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైకాపా అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు.

4. శోభాయమానం శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌: కేటీఆర్‌ 

మధ్య మానేరు వెనుక జలాలతో శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ మరింత శోభాయమానంగా కన్పిస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు అధికారిక జల కూడలిగా అభివర్ణించారు. ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోందని వివరించారు.

5. కాంగ్రెస్‌లోకి ఎంపీ అర్వింద్‌ సోదరుడు

తెలంగాణలో పలువురు భాజపా ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు నిజామాబాద్‌ మాజీ మేయర్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సోదరుడు ధర్మపురి సంజయ్‌, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత ఎర్ర శేఖర్‌, భూపాలపల్లి సీనియర్‌ నాయకుడు గండ్ర సత్యనారాయణ వెల్లడించారు. 

6. భారత్‌లో.. కరోనా సోకిన తొలివ్యక్తికి రీ-ఇన్‌ఫెక్షన్‌!

దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన తొలి వ్యక్తికి మళ్లీ వైరస్‌ సోకింది. ‘దేశంలో కరోనా వైరస్‌ సోకిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన మహిళ తాజాగా రీ-ఇన్‌ఫెక్షన్‌ బారినపడింది. యాంటీజెన్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినప్పటికీ ఆర్‌టీ-పీసీఆర్‌లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవు’ అని కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కేజే రీనా వెల్లడించారు.

7. Delta variant: ప్రపంచాన్ని వేగంగా చుట్టుముడుతోంది..

కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను వేగంగా చుట్టుముడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. ఇది భౌగోళిక ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ కరోనా రకం 104 దేశాలకు వ్యాప్తి చెందిందని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

8. Stock market: సూచీల్లో లాభాల జోరు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. వ్యాక్సినేషన్‌లో పురోగతి, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెన్స్‌ 397 పాయింట్ల లాభంతో 52,769 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద ముగిసింది.

9. Tokyo Olympics: క్రీడా గ్రామం ఆరంభం

ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధమైంది! అత్యయిక స్థితిలోనే మంగళవారం ఒలింపిక్స్‌ గ్రామాన్ని తెరిచారు. ఎంతో ఘనంగా జరపాల్సిన ఈ వేడుక కరోనా కారణంగా సాదాసీదాగా మారింది. జులై 23 నుంచి మెగా క్రీడలు ఆరంభమవుతున్న సంగతి తెలిసిందే. క్రీడా గ్రామంలో ప్రతి రోజూ క్రీడాకారులకు కొవిడ్‌ పరీక్షలు చేస్తారు. క్రీడా గ్రామంలో ప్రతి రోజూ క్రీడాకారులకు కొవిడ్‌ పరీక్షలు చేస్తారు. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు రెండుసార్లు పరీక్షలు ఉంటాయి. టీకా వేయించుకున్నప్పటికీ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి.

10. దేశీయ ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాల వెల్లువ!

ఐటీ రంగంలోని పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు, సర్వీస్‌ ప్రొవైడర్లు అత్యవసరంగా టెక్ నిపుణుల నియామకం కోసం  ఎదురు చూస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపార సంస్థలు డిజిటల్‌ వైపు అడుగులు వేస్తుండటం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో ఐటీ సేవలకు భారీగా గిరాకీ ఏర్పడుతోంది. ప్రధానమైన పలు ఐటీ కంపెనీల్లో వేలాది కొలువులు నిపుణులకోసం ఎదురు చూస్తున్నాయి. అంతేకాదు, ఆయా కంపెనీలు అర్హులైనవారికి పెద్దమొత్తంలో జీతాలను కూడా పెంచనున్నాయని తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని