Top Ten News @ 9 AM

తాజా వార్తలు

Updated : 05/06/2021 09:07 IST

Top Ten News @ 9 AM

1. CM KCR: చలో హుజూరాబాద్‌!

శాసన సభ్యత్వానికి ఈటల రాజేందర్‌ రాజీనామా చేస్తే హుజూరాబాద్‌ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల మాదిరి వ్యూహం అనుసరించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఆదివారం నుంచే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. హుజూరాబాద్‌, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్‌ మండలాలతో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట పురపాలక సంఘాలుండగా వాటన్నింటికి మంత్రులను ఎన్నికల బాధ్యులుగా నియమించనున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

KTR: కేంద్రం అనాలోచిత నిర్ణయాలతోనే టీకాల సమస్య

2. ఇది సరైన సమయమేనా?

లాక్‌డౌన్‌ సడలింపుల సమయం పెరగడంతో స్థిరాస్తి మార్కెట్‌ ఊపిరి పీల్చుకుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. గతంలో ఒప్పందాలు చేసుకుని పెండింగ్‌లో ఉన్న లావాదేవీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుతుండటంతో కొత్త ప్రాజెక్టుల్లో సందర్శనలు మొదలయ్యాయి. మున్ముందు లాక్‌డౌన్‌ వేళలను పగటిపూట పూర్తిగా సడలించే అవకాశం ఉండటంతో జూన్‌ మూడోవారం నుంచి మార్కెట్‌ సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Vaccine: టీకాతో మరణం ముప్పు దూరం

వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి కరోనా సోకినా... తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. జన్యుక్రమ పరిశీలనలో భాగంగా- వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొవిడ్‌కు గురైన 63 మంది ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్‌ నిపుణులు గమనిస్తూ వచ్చారు. వీరిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక్కడోసు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారే. మొత్తంగా 53 మంది కొవాగ్జిన్‌, 10 మంది కొవిషీల్డ్‌ టీకా వేయించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: ఒకసారి వస్తే 10 నెలల వరకూ రక్షణ!

4. TS News: కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే..

కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే.. తింటున్న వ్యక్తి తింటున్నట్లే ప్రాణాలు పోయాయి అని వింటుంటాం. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి అలానే తుదిశ్వాస విడిచాడు. రొట్టెను తుంచుకునేందుకు దాని మీద పెట్టిన చేయి అలానే ఉండగా.. కూర్చున్న స్థితిలోనే నోటిలో రక్తం కారుతూ మృత్యువాతపడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసేసరికి సుమారు 24 గంటలు అయింది. అప్పటికి అదే స్థితిలో కట్టెలా మృతదేహం బిగుసుకుపోయి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Corona: ప్రవర్తన మారితే ప్రమాదం

ప్రజలంతా కొవిడ్‌ నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తుండటంతో ప్రస్తుతం దేశంలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. ఇదే ప్రవర్తనను జనం ఇకముందూ కొనసాగించాలని.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పరిస్థితులు మళ్లీ మొదటికొస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా గత డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిల్లో మాదిరిగా వ్యవహరిస్తే.. మూడో ఉద్ధృతి తప్పదన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పొడవైన ఆర్‌ఎన్‌ఏ వల్లే అన్ని మ్యుటెంట్లు!

6. AP News: గొంతు కోశాడు.. అంతమయ్యాడు

 ప్రేమించమని వేధిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపిందనే కారణంతో చిత్తూరులో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కను రక్తపు మడుగులో చూసిన యువతి తమ్ముడు కోపంతో ప్రేమోన్మాదిని బండతో కొట్టి చంపాడు. చిత్తూరు ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరులోని సాంబయ్యకండ్రిగకు చెందిన వరదయ్య, లతకు సుష్మిత(22), సునీల్‌ సంతానం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సమరానికి ముందు

ఠిన క్వారంటైన్‌లోనూ టీమ్‌ఇండియా క్రికెటర్లు హుషారుగా కనిపిస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు వెంట ఉండటమే కారణం! క్వారంటైన్‌లో తమ పిల్లలతో ఉన్న చిత్రాలను రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్య రహానె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మరోవైపు కెప్టెన్‌ కోహ్లి సవాల్‌కు సిద్ధంగా ఉన్నాడని చెబుతూ మైదానంలో విజయ సంకేతం చూపిస్తున్న అతడి ఫొటోను ఐపీఎల్‌లో తను సారథ్యం వహించే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోస్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నాయకుడిగా నేను ఉండలేను

8. నావెన్నెల కనుమరుగైంది!

సన్నాయి మేళాలు.. పన్నీటి జల్లులు.. పడుచుల కోలాహలం.. బంధువుల ఇంట్లో పెళ్లి సందడి భలేగా ఉంది. వీటన్నింటి మధ్యలో వీణానాదంలా నా గుండెను తాకిందో నవ్వు. తెల్ల చుడీదార్‌లో దేవకన్యలా మెరిసిపోతోంది ఆ నవ్వుని పుట్టించిన అమ్మాయి. ఎవరని ఫ్రెండ్‌ని అడిగా. ‘వెన్నెలరా! నాకు చెల్లి అవుతుంది. మనూరే! ఇప్పటిదాకా చూళ్లేదా?’ అన్నాడు. ఆరో తరగతి నుంచి నా చదువు హాస్టల్లోనే. పండక్కో, పబ్బానికో ఇంటికొస్తాను. పైగా వాళ్లిల్లు మాకు దూరం. ఇక చూసేదెలా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. United Airlines: ఇక విమానయానం సూపర్‌!

ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు మరోసారి గగనసీమలోకి ప్రవేశించనున్నాయి. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌.. బూమ్‌ సూపర్‌సోనిక్‌ అనే అంకుర సంస్థ నుంచి 15 ‘ఓవర్‌ట్యూర్‌’ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇవి ప్రస్తుతం అత్యంత వేగంగా పయనించే ప్రయాణికుల జెట్‌ల కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళతాయి. భద్రత, నిర్వహణపరమైన ప్రమాణాలను అందుకోగానే వీటిని సమకూర్చుకుంటామని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ తాజాగా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సాగర గర్భం.. మరింత శక్తిమంతం!

10. Polavaram Project: పోలవరం బిల్లులు వెనక్కి

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల వివాదం సమసిపోలేదు. 2013-14 ధరల ప్రకారమే తాము సాయం చేస్తామని గతంలో కేంద్ర ఆర్థికశాఖ విధించిన కొర్రీ నుంచి మినహాయింపు లభించకపోవడంతో బిల్లులు మంజూరు చేయించుకోవడం అధికారులకు తలకు మించిన భారం అవుతోంది. పోలవరం ప్రాజెక్టు బిల్లులకు కేంద్రం, పోలవరం అథారిటీ కొర్రీలు వేస్తున్నాయి. కొన్ని బిల్లులను తిప్పి పంపుతున్నాయి. గడిచిన వారంలో రూ.333 కోట్లు ఖాతాకు జమ చేస్తున్నట్లు వర్తమానం అందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని