Top Ten News @ 9 AM

తాజా వార్తలు

Updated : 09/06/2021 09:19 IST

Top Ten News @ 9 AM

1. 15 రోజుల్లో 4.46 లక్షల మందికి రేషన్‌ కార్డులు

రాష్ట్రంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని, అపరిష్కృతంగా ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే వాటిని మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్‌కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర మంత్రిమండలి ఆదేశించింది. హైదరాబాాద్‌ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్ల’ ఏర్పాటుకు అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS Lockdown: పగటివేళ లాక్‌డౌన్‌ ఎత్తివేత

2. China: చైనాలో గజరాజుల మహా పాదయాత్ర!

అంతర్జాతీయ మీడియా దృష్టి ఇప్పుడు చైనాపై పడింది. అయితే అది కరోనా వైరస్‌ గురించి కాదు. అక్కడ ఓ ఏనుగుల గుంపు చేస్తున్న మహా పాదయాత్ర గురించి. మరోవైపు యూట్యూబ్‌, ట్విటర్‌ల నిండా ఆ గజరాజులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. నెటిజన్లు వాటిని చూస్తూ అబ్బురపడుతున్నారు. సాధారణంగా ఏనుగులు అడవిలోని తమ ఆవాసాల నుంచి పెద్దగా బయటకు రావు. కానీ చైనాలోని ఓ ఏనుగుల గుంపు మాత్రం విచిత్రంగా అడవిని వదిలేసి నగరాల్లోకి వచ్చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గంటకు 324 కి.మీ వేగం

ఇటలీకి చెందిన సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని తమ హరికేన్‌ ఈవీఓ రియర్‌-వీల్‌ డ్రైవ్‌ (ఆర్‌డబ్ల్యూడీ) స్పైడర్‌ను భారత విపణిలోకి మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.3.54 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌). ఈ కొత్త మోడల్‌ వి10 ఇంజిన్‌తో రూపొందింది. 610 హెచ్‌పీ సామర్థ్యంతో 3.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. గంటకు గరిష్ఠంగా 324 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మళ్లీ ఐపీఓల సందడి!

4. Artificial sun: మహా కృత్రిమ సూర్యుడు!

సూర్యుడి కన్నా పదింతల వేడి! అదీ మన భూమ్మీద. అదెలా సాధ్యమంటారా? అదే నిజమైతే చెట్లు, పుట్టలు, గుట్టలు, సముద్రాలు, సమస్త జీవరాశులన్నీ మాడి మసై పోవటం ఖాయమనేగా మీ భయం. అంత భయం అవసరం లేదు. ఇదో చైనా ప్రయోగం. ‘కృత్రిమ సూర్యుడి’ని సృష్టించాలనే ప్రయత్నంలో భాగం. ఎక్స్‌పెరిమెంటల్‌ అడ్వాన్స్‌డ్‌ సూపర్‌కండక్టింగ్‌ టొకమాక్‌ (ఈస్ట్‌) పరికరం సాధించిన ఘనత. సూర్యుడిలో శక్తి ఉత్పత్తి ప్రక్రియను అనుకరించే ఈ పరికరం ఇటీవల 20 సెకండ్ల పాటు రికార్డు స్థాయిలో 16కోట్ల డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతను సృష్టించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆగ్రా ఆసుపత్రిలో 22 మంది మృతి?

అనుమతులకు మించి కొవిడ్‌ బాధితులను చేర్చుకున్న ఓ ఆసుపత్రి.. ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంతో కొందరిని బయటకు పంపించేందుకు ఓ పథకం రచించింది! మాక్‌ డ్రిల్‌ పేరుతో ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి 22 మంది చనిపోయారని తెలుస్తోంది. ఏప్రిల్‌ 26న జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం ఉత్తర్‌ప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* UP: కాన్పూర్‌లో ఘోర ప్రమాదం: 17 మంది మృతి

6. Cricket News: ఐపీఎల్‌ అప్పటి వరకు అంటే కష్టమే...

పీఎల్‌-14 రెండో దశ మ్యాచ్‌ల షెడ్యూలు తయారీలో సతమతమవుతున్న బీసీసీఐకి ఇప్పుడు చిక్కొచ్చి పడింది. డబుల్‌ హెడర్‌లను తగ్గించడం కోసం టోర్నీ జరిగే రోజులను పెంచాలని, అక్టోరు 15న ఫైనల్‌ నిర్వహించాలని బోర్డు భావిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కానీ అక్టోబరు 10 దాటి టోర్నీని నిర్వహణకు అనుమతించేందుకు ఐసీసీ సుముఖంగా లేదట.  ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయని. సెప్టెంబరు-అక్టోబరులో మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ గత నెలలోనే ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తాగునీరు లేక చిన్నారి మృతి

రాజస్థాన్‌లో తాగునీరు దొరక్క అయిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతోపాటు ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది. రాయ్‌పుర్‌ నుంచి రాణివాడా తాలూకాలోని రోడా గ్రామానికి సుకి దేవి భిల్‌ (60) చిన్నారితో బయలుదేరింది. ఎండ ఎక్కువగా ఉండటం, మార్గమధ్యంలో తాగడానికి నీరు కూడా లేకపోవడం వల్ల ఉన్నట్టుండి ఇద్దరూ కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అధికారులు వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే

8. Cyber Crime: బండి కాదు.. తొండి ఇది!

‘‘ముప్పై మిలియన్ల కార్లు అమ్ముడైన సందర్భంగా ఫలానా కంపెనీ మీకు ఉచితంగా కారు ఇస్తోంది. మీ వివరాలు పంపితే చాలు’ అంటూ మీ వాట్సాప్‌కు సందేశం వచ్చిందా?  ‘‘ ఫలానా సంస్థ వార్షికోత్సవ సందర్భంగా వినియోగదారులకు కార్లు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం.. తీసుకోండి.’’ అన్న ప్రకటనలు మీ చరవాణికి వస్తున్నాయా?.. ఇవి నిజం కాదు. కారు వస్తుందంటూ మీ వాట్సాప్‌ను తెరచి అందులో వివరాలన్నీ నింపేసి.. మీ స్నేహితులు, సన్నిహితుల్లో 20 మందికి పంపినా సరే.. మీకు కారు రాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Antibodies: యాంటీబాడీలే ప్రామాణికం కాదు

టీకాల పనితీరును చాటిచెప్పడానికి యాంటీబాడీల ఉత్పత్తి ఒక్కటే ప్రామాణికం కాదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. దీన్నిబట్టి టీకా పనితీరును అంచనా వేయడానికి వీల్లేదన్నారు. భారత్‌లో లభ్యమవుతున్న వ్యాక్సిన్లన్నీ ఇంతవరకు దేశంలో కనిపించిన వైరస్‌ రకాలపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. దిల్లీలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పురుషుల్లో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌

10. ఆరోగ్యాన్నిచ్చే తులసి కషాయం!

కొవిడ్‌కు తోడు కాలమూ మారింది. వానలు మొదలయ్యాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారి గాలిలో తేమ పెరిగింది. ఈ కాలంలో జలుబు, దగ్గు లాంటివి సాధారణమే కానీ... ఈ మహమ్మారి మాటు వేసిన వేళ ఆరోగ్యాన్ని మరింత భద్రంగా కాపాడుకోవాలి. రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచుకోవాలి. అందుకోసం ఈ ఔషధ గుణాలున్న కషాయాన్ని ప్రయత్నించండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని